Kshamatha-15.12.2015-sathsang




Download Kshamatha .wav (audio) [107mb file size]

Download Kshamatha PDF (text) [372 kb file size]

క్షమత
జీవితంలో ఎవరినైనా, ఎప్పుడైనా క్షమించారా?
ఆ అవకాశం వచ్చిందా?
క్షమించినటువంటి అవకాశం వచ్చిందా?
క్షమించాలంటే ఏం చెయ్యాలి మొట్టమొదట?
క్షమించాలంటే ఏం చెయ్యాలండి?
పోనీ, రివర్స్‌ ప్రశ్నిద్దాము.
ఎవరి చేతనైనా క్షమింపబడాలంటే ఏం చెయ్యాలి? మనం.
మనం ఒకళ్ళ చేత క్షమింపబడి వుండాలి అంటే, మనం ఏం చేసి వుండాలి వాళ్ళకి?
                                  
                                   మీరు ఎవరూ ఆన్సర్లు చెప్పకపోతే నేనేమీ పాఠం చెప్పనండి. నా పద్ధతి తెలిసిందే కదా! మీకు, ఉపన్యాసం చెప్పుకునేపోయేవాడిని కాదు. అట్లా అయితే, మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయమని, ఏదో మామూలుగా కూర్చోమని, ఆ పద్ధతి కాదు మనదంతా. మీ అవగాహనా సామర్థ్యాన్ని పెంచడమే నాపని. అది. అది పెరగలేదనుకోండి, అలాగే గానుగ ఎద్దులానే తిరుగుతూ వుంటావు అంతే. మార్పురాదు. అట్లా ఆ తెలివి అందులోనే వుంటే ప్రయోజనమేమీ లేదు. నువ్వు ఎదగాలంటే, పై స్థాయి తెలివి తేటలు రావాలి. పై స్థాయి తెలివితేటలు వస్తేనే, ఈ తత్త్వజ్ఞానం అర్థం అవుతుంది.  లేకపోతే మీరు ఎంతకాలం బుర్రబద్ధలు కొట్టుకున్నా, ఆ పంచీకరణ ఐదు ఐదుల ఇరువై ఐదు అంతే వుంటుంది. అర్థమైందా?

                                   లక్షల సంవత్సరాల నుంచి బోధించినప్పుడు వేదవ్యాసుడు చెప్పినప్పటి నుంచి, ఐదు ఐదుల ఇరువై ఐదు అంతే వుంది. ఆ పాఠాల్లో ఏ మార్పు రాలేదు. వేదాంత పాఠాలలో ఏ మార్పు వుండదు. అవే వుంటాయి. ఉపనిషత్తులు చెప్పినకాలం నుంచి ఇప్పటి వరకూ అవే వున్నాయి. ఏం మార్పులు చేయలేదు. అర్థమైందా?

కాకపోతే తెలివితేటలు ఎవరివి మారాలి?
మనవే మారాలి. మారాలి అంటే ఇలా ప్రశ్నలు వేసుకోవాలి.
నేను ఎప్పుడైనా జీవితంలో ఎవరినైనా క్షమించానా?
లేదూ ఎవరి చేతైనా క్షమించబడ్డానా?
ఈ రెండు కాన్‌సీక్వెన్సెస్‌ జీవితంలో అనుభూతిలో వుండాలి.
ఎందుకని? ఎందుకు వుండాలండి?
రోజూ భగవంతుడిని ఏం వేడుకుంటున్నావు? ఏం వేడుకుంటున్నామండీ?

                                   క్షమించమనే కదా! వేడుకుంటున్నావు. రోజూ మీరు పూజలు, ఆలయాల్లో చేయండి, మీరు ఎక్కడైనా చేయండి. పూజలు చేయండి, వ్రతాలు చేయండి, జపాలు చేయండి, అన్నీ చేయండి. అన్నిట్లో అది వుంటుంది.

                                   నాయనా! నేను తెలిసో, తెలియకో చేసినవాటిని అన్నింటినీ దయతో క్షమించేసి, నన్ను గట్టున వేసేయి అని అడుగుతావుంటావు.
భాషవేరే కాకపోతే. తెలుగు కాదది. సంస్కృతము. అర్థమైందా?
ఎందుకు క్షమించాలి ఈశ్వరుడు?
మనం ఈశ్వరుడికి ఏం చేశామండి?
నువ్వు ఈశ్వరుడి చేత క్షమించబడాలి అంటే, రెండు లక్షణాలు మనకు అనుభూతం అయ్యి వుండాలి అని చెప్పాకదా! నువ్వు క్షమించడం నీకు తెలిసి వుండాలి. లేదంటే, క్షమించబడినటువంటి సంఘటన అయినా కానీ నీకు అనుభూతం అయివుండాలి.
ఈ రెండూ మనకు అనుభూతమై వున్నాయా?
వున్నవాళ్ళు ఎవరన్నా కళ్ళల్లో ఎక్కడా కనపడడం లేదు. కళ్ళల్లో మెరుపులు కనపడడం లేదు. మెరుపులు లేకపోతే లేకపోయినట్లే. అలాంటి సందర్బం మీలో రానట్లే. అది.
వుండాలా? అక్కర్లేదా? అసలది?
వుంటేనే కదా! మనకు...

                                   ఒక్కటి గుర్తుపెట్టుకోండి! అనుష్టాన వేదాంతమే నీతో మిగిలేది. మిగిలిందంతా వట్టిదే. మిగిలినది అంతా వాచా వేదాంతము. అర్థమైందా అండీ! వాచా వేదాంతము అంటే, రోజూ నేను ఆత్మస్వరూపుడిని అనుకోవడము, నేను ఈశ్వరుడిని అనుకోవడం, నేను బ్రహ్మస్వరూపుడిని అనుకోవడం, పుస్తకాలు చదువుకోవడం, స్తోత్రపాఠాలు వల్లె వేయడం ఇవన్నీ అవసరమే. నేనేమీ కాదనడం లేదు. అదంతా ప్రాథమిక విద్య. ఆ విద్య లేకుండా తరువాత నేను చెప్పిన మాటలు నేర్చుకోవాలంటే, అసలు ఆ బేసిక్‌ అవగాహన లేకుండా నువ్వు నా దాంట్లోకి రాలేవు. అవి నేర్చుకున్నావు గానీ, అక్కడే ఆగిపోతే, ఎల్‌.కే.జీ తోటే నీ చదువు అయిపోయినట్టే. అది కేవలం ప్రాథమిక విద్య అంతవరకే. దానిని నిజజీవితంలోకి అనువదించుకోవడం రావాలి. ఇప్పుడు మనం రోజువారి జీవితంలో జీవిస్తున్నామండి.       

రోజూ ఎవరినైనా క్షమిస్తున్నామా?       
రోజూ ఎవరిచేతైనా క్షమించబడుతున్నామా?                       
లేదూ సంవత్సరానికి ఒకసారి క్షమిస్తున్నామా?
సంవత్సరానికి ఒకసారి క్షమించబడుతున్నామా?
అసలు ఈ సందర్భం ఎప్పుడు వస్తుంది?
(మనం ఎదిగితే అవతలి వాళ్ళను క్షమిస్తామండీ!)
మనం ఎదిగితే క్షమిస్తాము.
ఎప్పుడు క్షమిస్తాము? ఎందుకు క్షమించాలి అసలు వాడిని?

క్షమత అంటే ఏమిటి అసలు?
అందులోనుంచి వచ్చిందే కదా! క్షమత అనే శబ్దంలోనుంచే క్షమించడం, క్షమించబడటం అనే రెండు క్రియలు పుట్టినాయి.
క్షమత అంటే ఏమిటి?
కూడా తీసేయి.

క్షమఅంటే ఏమిటి అసలు? తెలుగు శబ్దమా? సంస్కృత శబ్దమా అది?
                                   అంటే భాషాజ్ఞానం బాగా తగ్గిపోయింది ఒక తరం మారేటప్పటికి. కొద్దిగా.. మన బాబూరావు గారి తరానికి అయితే కొద్దిగా భాషాజ్ఞానం వుంది. తరువాత తరం వాళ్ళు అంతా కనబడుతున్నారు ఇప్పుడు. ప్రస్తుతం భాషాజ్ఞానం అడుగవలసిన పరిస్థితి వచ్చేసింది.

క్షమ అనేది తెలుగు శబ్దమా? సంస్కృత శబ్దమా?
(సంస్కృత శబ్దం అండీ!)
ఆ.. తెలుగు శబ్దం కాదు, సంస్కృత శబ్దమే అది.
క్షమఅంటే ఏమిటి?
(క్షామముఅంటే కరువు. క్షమఅంటే...) (క్షేమము...)
ఆ.. క్షేమము, క్షామము, క్షమ బానేవుంది. క్షకారము మీద పదాలు బానే వచ్చాయి. కానీ,
క్షమఅంటే ఏమిటి?
(క్షమించడం అంటే ఏమిటి? ఫర్‌ గివ్‌ నెస్ కదా? ఆ.. ఫర్‌గివ్‌నెస్‌)

                                   ‘క్ష అంటే బాధించుట. క్ష అంటే బాధించుట. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ క్షకారము మీదనే వాళ్ళు అన్నీ ఎందుకు వేశారంటే, క్ష అంటే బాధించుట. లేక వేదన పడుట. అంటే ఆ బాధ లేకుండా చేయుట. ఆ వేదనని లేకుండా చేయుట. బాధపడకుండా చేయుట. వేదన పడకుండా చేయుట. లేదూ బాధను లేకుండా చేయుట. వేదనని లేకుండా చేయుట. అంటే అర్థం అది. ఎక్కడైనా కారం యొక్క వుద్దేశ్యము అది. అంటే ఏకాక్షరము కూడా సంస్కృతములో శబ్దమై... వాళ్ళు ఆ భాషని పొందికగా ఏర్పాటు చేశారు. తెలుగులో అట్లా వుండవు. తెలుగులో అన్నీ రెండు మూడు అక్షరాలు కలిస్తేనే పదాలు తయారౌతాయి. కానీ సంస్కృతములో అట్లా కాదు. క్ష అంటే బాధించుట. లేక వేదన పడుట. లేదా బాధించబడుట. అది ఏ రకమైన క్రియగా ఉపయోగపడ్డా కూడా. వేదన అన్న దృష్టిని ఉద్దేశ్యించి, క్షకారాన్ని వాడారు అక్కడ. అర్థమైందా అండి?


క్ష్మాపాలుడుఅని కూడా అంటాము. అది తెలుసా మీకు ఎవరికైనా?
క్ష్మాపాలుడు. రాజుని క్ష్మాపాలుడు అంటారన్నమాట.
ఎందుకని అట్లా ఆ శబ్దం వేశారు?
                                   ప్రజలందరి యొక్క వేదననీ తొలగించువాడు క్ష్మాపాలుడు. అర్థమైందా అండీ! చాలా అర్థవంతమైనటు వంటి శబ్దాలు వుంటాయండి. అంటే మీ అందరకీ కొద్దిగా ఆ రకమైనటువంటి భాష ఆనందించే లక్షణం వుంటే, మీరు చదివే పుస్తకాలని, ఇట్లా ఆనందిస్తూ చదువుతారు. ఆహా! ఇవాళ నేను చాలా గొప్ప విషయాన్ని తెలుసుకున్నాను. అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నాను.

నిజజీవితంలో ఎప్పుడన్నా వాడుతారా? ఈ క్షకారముతో వున్నటువంటివి?
నోరు తిరగని పదాలు మనకు ఎందుకండీ?
అతడు ఆమె పోయే వచ్చే... అనుకుంటే జీవితము అయిపోయే.
కానీ తెలివితేటలు ఎట్లా వస్తాయి?
రావు. అర్థమైందా అండీ!
కాబట్టి క్ష్మాపాలుడు అంటే అర్థం అది. క్షకారము చాలా.. జీవితంలో అందుకే..
మనకు అక్షరాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండీ?
( నుంచి వరకు)
నుంచి నా? 56 అక్షరాలు ఎక్కడి నుంచి ఎక్కడికి?
కారము నుంచి క్షకారము వరకే. లు లేవు. అర్థమైందా అండీ!
అంటే ఇప్పుడు ఎవరికీ... అక్షరాలు కూడా మరచిపోయారు అంతా!  

                                   అది కారము నుంచి క్షకారాంతము. కారము ఆది, క్షకారము అంతము. కారము నుంచి క్షకారము వరకు వున్న ఏ అక్షరమైననూ మంత్రమై భాసిస్తుందన్న మాట. వాటికి మూలం సంస్కృతములో వుంది. అర్థమైందా అండీ! సంస్కృతం అక్షరాలు వాళ్ళు నియమం చేసి, అక్షరమాలను నిర్ణయం చేసి, దాని నుంచి తెలుగును తీసుకొచ్చినప్పుడు కూడా, ఆ రకమైనటువంటి దైవీశక్తిని పోనివ్వకుండా చేశారన్నమాట దానిని. అర్థమైందా అండీ!
                                   ఏ ఒక్క అక్షరాన్ని నిరంతరాయంగా జపం చేసినా, అది మంత్రమై భాసిస్తుందన్నమాట. వాటిలో ఆ శక్తి వుంది. కారము నుంచి క్షకారము వరకు. నీకు భావమే వుండాలే గాని, ప్రత్యక్షరము మంత్రమై భాసిస్తుంది. అంత శక్తి కలిగినటువంటి, అక్షరాలు అన్నమాట అవి. అందుకే అవి అక్షరములు. అర్థమైందా అండీ! అక్కడ కూడా క్షకారమే పెట్టాము.

అక్షరము అంటే ఏమిటి?
క్షరము అంటే?
నాశనము.
ఎలా? వ్యుత్పప్తి చెప్పండి చూద్దాము? ఎలా నశిస్తుంది?
క్షరము అంటే నశించునది అని మీ అందరికి బాగా మనసులో పడిపోయింది. ఎలా?
అక్షరము అంటే నశించనిది. క్షకారానికి ఇప్పుడే చెప్పా. క్షకారము అంటే ఏమిటి?
వేదన. క్షరము అంటే బాధిస్తూ పోతుంది. వేదన కల్గిస్తూ పోతుంది. నశించిపోతుంది. అర్థమైందా అండీ?
ఎవరైనా బాధ కలిగేవి పోవాలనుకుంటారా? ఆనందక్షణాలు పోవాలనుకుంటారా?
క్షణము – అక్కడ ఇంకో క్షకారము వేశా మీకు.
క్ష – అంటే మళ్లా క్షణము అన్నాము అందుకే.
ఎందుకని క్షణము అన్నామండీ?

                                   మీరెవ్వరూ మీకు మీరు చదువుకున్న పుస్తకాలలో, క్షకారము మీద ఎన్ని శబ్దాలు వచ్చో, ఇంటిదగ్గర హోం వర్క్‌ రాయండి. అప్పుడు మీకు తెలుస్తుంది అది. అంటే మనలో ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతీది సమర్థతే అయ్యి వున్నది. అది గుర్తుపెట్టుకోండి. నీవు ఎంత సమర్థుడవై వుండాలి అంటే, నీ తరువాత తరాలు, తరాలు, తరాలు, తరాలు నిన్ను ఆశ్రయించి, ఈయన దగ్గర ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలిపోయిందిరా బాబు! అనే స్థితిలో మనం వుండాలి.
ఇప్పుడు అలా వున్నామా?

ఎవరన్నా ఏమన్నా చెప్పండి అంటే మన దగ్గర ఏమన్నా వున్నాయా?
సైలెన్సేనా? అంతా మౌనవ్యాఖ్యయేనా?
అది అర్థం కాదుగా పిల్లాడికి. ఏమండి? ఇట్లా అసలు మనం ఎదుటివాడికి ఏం నేర్పగలిగే సమర్థత మనలో ఏరోజు కారోజు ఏం నేర్చుకున్నాము, ఏం పెంపొందించుకున్నాం? మన తరువాత తరాల వారికి ఏం నేర్పగలిగే సమర్థత మనలో వుంది?
ఎంత సేపు వంకాయ కూర ఎలా వుండాలి? బీరకాయ కూర ఎలా వుండాలి అదేనా?

                                   అది వాడు ఎట్లాగు నేర్చుకుంటాడు. వాడికి ఆకలి వేస్తుంది. వాడికి ఆకలి వేసినప్పుడు వాడు ఎట్లాగు ఆహారం వండుకోవడం వాడికి చేతనౌతుంది. నువ్వు తిన్న వంకాయ కూర, బీరకాయ కూర వాడు ఎట్లాగు తినడు. పిజ్జాలు, బర్గర్లే తింటాడు వాడు. అర్థమైందా అండీ! వాడి జీవన శైలిని బట్టి వుంటుంది అది.

కానీ మనం అసలు వాళ్ళకి ఏం నేర్పాలి?
ఏం నేర్పితే అసలు వాడు మనల్ని ఆశ్రయిస్తాడు?
అంతేనా కాదా? అండీ!
పెద్దవాళ్ళందరికీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, పుట్టినరోజు ఏదైనా అంశాలు వచ్చినప్పుడు పెద్దలకి నమస్కరించాలా వద్దా? పిల్లలందరూ కూడా ఎందుకు నమస్కరించాలి?
(ఆశీర్వాదం కోసం)
ఏ? ఏమని ఆశీర్వదిస్తావు?
(దీర్ఘాయుష్మాన్‌ భవ)

భార్యగారు, భర్త గారి ఆశీర్వచనము తీసుకోవాలా వద్దా?  తీసుకోవాలా?
భార్యగారు, భర్త గారి ఆశీర్వచనము తీసుకోవాలా తీసుకోనక్కరలేదా?
భర్తగారు, భార్య గారి ఆశీర్వచనము తీసుకోనక్కరలేదా? లేదా అలాగ?
(తీసుకోవచ్చు కానీ ప్రస్తుతం అమలులో లేదు.)
ఎందుకని? ఇది అమలులోవుందా? ఇదీ లేదుగా!
                                   భార్యగారు భర్తగారి కాళ్ళకి దండం పెట్టమనే మంచి సంప్రదాయం, ఆ తరంలో వుండేది అదిగో. పైతరాలలో. ఈ తరంలో లేవు. ఇప్పుడంతా ఏరా పోరా నే. అర్థమైందా అండీ!
పైగా అది ఏమంటున్నారు పైగా?
                                   సాన్నిహిత్యము అని అనుకుంటున్నారండి. దోషం అన్నమాట అది. ఒకటి గుర్తు పెట్టుకోండి. ఎవరినైనా పూర్వకాలంలో వాళ్ళయొక్క బాధని వ్యక్తం చేయాలనుకుంటే, అప్పుడు మాత్రమే ఏకవచన ప్రయోగం చేసేవాళ్ళు. చాలామందికి తెలియదండి ఈ విషయం. ఇప్పుడు ఎప్పటి మాటలు మాట్లాడుతున్నానంటే, రామాయణ కాలం, త్రేతాయుగ కాలం నుంచే మనకు అన్నీ వారసత్వ సాంప్రదాయాలు వచ్చినాయి. కృతయుగ కాలం నాటి వారసత్వ సాంప్రదాయాలు ఇప్పుడు మనం చెప్పుకోవడానికి అనువుగా మనం అసలు జీవించడం లేదు. కాబట్టి వాటిని వదిలేశాము. శ్రీరామచంద్రమూర్తి కాలం నుంచి కూడా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుని మాట్లాడుకునే ధోరణిని రామాయణం మనకి నేర్పిందన్నమాట. ఏరా పోరా లేదు.

తండ్రి అయినా, కొడుకు అయినా, ఏ సంబంధాలైనా సరే, ఒకరినొకరు ఏకవచన ప్రయోగంలో ప్రయోగించకూడదు. ఎందుకని? ఎందుకనో చెప్పండి చూద్దాం?
(దైవీభావన పోతుంది)
ఎందుకు పోతుంది?
మనమందరం దివ్యత్వానుభూతిలో వుండాలి అంటే, ఏ స్థానంలో వుండాలి?
(మనమందరం దివ్యత్వానుభూతిలో వుండాలి అంటే) హృదయస్థానంలో వుండాలి. హృదయస్థానంలో వున్నప్పుడు, నువ్వు ఏకవచన ప్రయోగం చేయలేవు. అర్థమైందా అండీ! తర్వాత కాలంలో నిందాస్తుతులతో కూడినటువంటి కావ్యాలు వచ్చినాయి. కలియుగ కాలంలో. అదికూడా కలియుగంలో మధ్యయుగకాలల్లో వచ్చినాయన్నమాట. ఆ నిందాస్తుతులతో, నా బాధలన్నిటికీ నీవే కారణము అని ఈశ్వరుడిని తిట్టడం. ఆ తరువాత అయ్యో! నిన్ను తిట్టానే అని మళ్ళా ఏడ్వడము. ఈ రకమైన వైక్లబ్యం’, ఇది కూడా సంస్కృత శబ్దమేనండి. వైక్లబ్యం అనేది కూడా.
                                   అంటే మనసు వికలత్వం చెందడాన్ని వైక్లబ్యం అని అంటారు. పరి పరి విధాలుగా మనసు ఆలోచించడం అన్నమాట. ఆ రకమైన లక్షణం అప్పుడు లేదు.
ఇప్పుడు మనం ఏ లక్షణంలో వున్నాము ఇప్పుడు?

మనసు పరిపరి విధాలుగా పోతోంది కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం?
రాత్రిపూట పడుకునేటప్పుడేమో ఈశ్వరుని నిందాస్తుతులతో నిందిచటం, పొద్దున్నే లేవగానే అయ్యయ్యో! తప్పైపోయింది బాబూ అని చెంపలు వేసుకోవడం. మళ్ళా పూజలు చేయడం.
ఎందుకని? రాత్రి భోగిగా నిద్రపోతున్నావు. రోజంతా పగలంతా ఏం చేశావు?
                                   ఆ దేహ వ్యాపారాలన్నీ చేశాం. ప్రారబ్ద కర్మానుసారం జీవించాము. వాడిని మనం తిట్టడమో, మనని వాడు తిట్టడమో, ఏదో ఒకటి జరుగుతోంది అక్కడ. అంటే మనం ఇతరులకు వేదన కల్గించడమో, లేదా ఇతరుల చేత మనం వేధించబడడమో, అర్థమైందా అండీ? అందుకనే క్షకారానికి అంత విలువ ఇచ్చి, ఇవాళ దాని మీదనే మాట్లాడుతున్నాము. ఈ వేదన కలుగజేయడం క్షకారము అన్నమాట. అర్థమైందా అండీ?
                                   క్షమఅంటే ఆ వేదన లేకుండా చేయడం. అర్థమైందా అండీ? కాబట్టి రోజువారీ జీవితంలో మనవల్ల ఎవరికైనా వేదన కలుగుతోందనుకోండి...
అప్పుడు మనం ఏ స్థితిలో వున్నాం?
వాళ్ళ చేత క్షమించబడేటటువంటి స్థితిలో వున్నాము. అర్థమైందా?
మనకే ఎవరి వల్లన్నా వేదన కలిగిందనుకోండి, అప్పుడు మనం ఏ స్థితిలో వుండాలి?
వాళ్ళను క్షమించే స్థితిలో వుంటాము.
ఈ రెండిటిలో ఏది పై చేయి? ఏది కింద చేయి?
(క్షమించగలగడం పైచేయి, క్షమించబడడం కింది చేయి)
ఏమండి, క్షమించగలగడం పైచేయి అని అందరూ ఒప్పుకుంటారా? అంతేనా లేకపోతే వాడి చేతే మనం క్షమించబడితే బెటరా? (better)
అలా కుదరదుగా. అంతేనా కాదా? ఎందుకని?
ఎందుకనో చెప్పండి చూద్దాం?
ఏకగ్రీవం, మీరు చిన్నపిల్లల్ని అడగండి, క్షమించడమే గొప్ప. సమస్య లేదు అందులో. ఎందుకని అని అడిగితే సమాధానం చెప్పలేకపోవచ్చుగాని, ఏరా నువ్వు వాడి దగ్గరకు వెళ్ళి తీసుకుంటావా? నువ్వు వాడికి ఇస్తావా? అని అడుగు. ఏం చెప్తాడు?
                                   ఇస్తాను అంటాడు. అంతేగాని తీసుకుంటాను అని అనడు. అంటే మనిషిలో మానవత్వం అనేటువంటి రూపధారణ చేయగానే, నీలో ఈ క్షమాగుణం, నీలో సహజలక్షణం అయివున్నదన్నమాట. అది నీలోపల ఇన్నేట్‌బిహేవియర్‌ innate behaviour అంటాము దీనినే. సహజ స్వభావం అన్నమాట. నీ చేయి ఎప్పుడూ ఆ పై చేయిగా వుండేటట్టుగానే జీవించడానికి ప్రయత్నిస్తావు గాని, చెయి కిందకి జీవించడానికి నీ మనసు అంగీకరించదు. ఎప్పుడెప్పుడైతే చేయి కిందైన సందర్భం వచ్చినప్పుడల్లా ఏమౌతావు? బాగా వేదనకు గురౌతావు. నా చేయి కింద అయ్యిందని లోపలది బాధపడిపోతూ వుంటుదన్నమాట. మళ్ళా నీ చేయి పై చేయి అయ్యేంత వరకూ పోరాడుతావు. అర్థమైందా? ఇది మనిషిలో వున్నటువంటి పురోగమన కారణం. ఇది లేకపోతే మనిషి పురోగమించడండి. అర్థమైందా అండి!

                                   ఇక వేదాంత విషయానికి వస్తే, తత్వజ్ఞానం నేర్చుకోవాలి అంటే, క్షమ సర్వస్వమై బరగుఅసలు అన్ని దైవీ లక్షణాలకి, ఆధారభూతమైనటువంటి దైవీ లక్షణము అంటూ ఏదైనా వుందంటే అది క్షమయే. అసలు క్షమించడం అనేటటువంటి లక్షణం రానటువంటి వారికి,
                                   మనసా వాచా కర్మణా ఈ క్షమ అన్నటు వంటి లక్షణం మనసులో నిరంతరాయంగా, రాశీభూతమైనటువంటి క్షమా స్వరూపంగా ఏ మనిషైతే వుంటాడో వాడే సాధు స్వరూపుడు. వాడికి ఈశ్వరుడికి భేదం లేదు.
ఎందుకని?
                                   సకల జీవులు మనుషులే కాదు, సకల జీవులూ కూడా భగవంతుని వేడుకొంటూ వుంటాయి. అయ్యా! నాకు తెలియక, తెలిసీ చేసినటువంటి పొరపాట్లు, దోషాలు, నన్ను దయతో క్షమించు. నువ్వు ఎప్పుడైతే ఈ క్షమాగుణాన్ని నువ్వు నిలబెట్టుకున్నావో, సర్వకాల సర్వ అవస్థల యందు ఈ క్షమ అనే లక్షణాన్ని ఎప్పుడైతే పునాదిగా పెట్టుకున్నావో, అప్పుడు నువ్వు ఏమౌతావు?
ఈశ్వరుడవే. 
ఆ ఈశ్వర లక్షణం నిన్ను ఎక్కడికి నడుపుతుందయ్యా?
నీవు ఈశ్వరుడివి అని తెలుసుకునే దాకా నడుపుతుంది.
ఇప్పుడు ఈ క్షమ, ఎంత దాని విలువ అంటే?

                                   అందుకే నేను మొదట అడిగింది. నీకు జీవితంలో ఎంత మందికి క్షమించినటువంటి అనుభూతి వున్నది? లేదూ క్షమించబడిన అనుభూతి, అది కూడా ఒకరకంగా మంచిదే. అంటే మనం రజోగుణ, తమోగుణ ధర్మాలతో ఒక్కొక్క కాలంలో మనం, అజ్ఞాన యుతంగా ప్రవర్తించినప్పుడు ఏమౌతుంది? మరొక జీవులకు, ఇతర జీవులకు బాధ కలుగుతుంది. వేదన కలుగుతుంది. కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నీకంటే ఉన్నతతరమైన సంస్కారం కలిగివున్నవాళ్ళు, నీకంటే ఉన్నతతరమైన స్వభావం కలిగివున్నవాళ్ళు, సత్వగుణ నిష్ఠ కలిగివున్న వాళ్ళు... వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు?
(క్షమిస్తారు)
సరేలే! నేను కూడా ఒకప్పుడు ఇలాగే వున్నాను కదా! అని పిల్లవాడి చేష్టలాగా భావించి, క్షమిస్తారన్నమాట.
ఆ క్షమించినటువంటి బలం ఎంత?
అసలు ఈ క్షమకి బలం ఎంత? వుందా లేదా దీనికి?
అసలు క్షమించాలంటే ఎక్కువ శక్తి కావాలా?
క్షమించబడాలి అంటే ఎక్కువ శక్తి కావాలా?
(క్షమించాలంటేనే ఎక్కువ శక్తి కావాలి.)
అంతేనా అండి?
క్షమించాలంటేనే కావాలా వద్దా? ఔనా? ఏకగ్రీవంగా ఒప్పుకుంటారా? మీరు ఏమన్నా వీటో చేయదలచుకుంటే శుభ్రంగా వీటో చేయవచ్చండి. మీరందరూ ఒక పక్షం, నేను ఒక్కడినే ఒక పక్షం. అర్థమైందా అండీ!

క్షమించాలి అంటే మనకు ఎక్కువ సమర్థత వుండాలి.
అంతేనా కాదా?
ఇతరులకు వేదన కలిగించాలి అంటే?
తక్కువ సమర్థత, దానికేం కావాలి?
దోమ కూడా కుట్టి, చక్కగా వేధిస్తుంది మనల్ని. ఔనా కాదా?
ఎప్పుడైనా, ఎవరినైనా మనం వేధించాం అనుకోండి, మనల్ని వాడు ఎలా చూస్తాడు అంటే, ఈ దోమవలె చూస్తాడు. అప్పుడు నువ్వు మనిషిస్థితి కోల్పోతావు వాడి దృష్టిలో. ఏమైపోతావు?
ఓహ్‌! వీడికి మానవత్వం లేదు, మానవ ఉపాధిలో వున్నాడు కానీ, ఏ లక్షణం పోలేదు?
(జంతువు లక్షణం) ఆ దోమ లక్షణం పోలేదు.
ఎందుకని?
కుట్టడమే దాని పని. అర్థమైందా అండీ?
                                   దానికి ఎంత రక్తమైతే అవసరమో....చాలా... కొన్ని విషయాలు చెబుతాను. క్రిమి కీటకాదులలో, ఈ దోమకు ఒక్కదానికి ఒక ప్రత్యేకత వుంది. దానికి కడుపు నిండినా సరే కుడుతుంది. అంటే ఈ ప్రపంచములో ఎవ్వరూ కూడా, ఒక జీవి మరొక జీవిని, ఆహారం కొరకే బాధించేటటువంటి అనుగ్రహాన్ని ఇచ్చాడు భగవంతుడు. అర్థమైందా అండి. ఇంకేం.... పొట్ట నిండింది అనుకోండి. అది దేనిని హింసించదు. సింహం వుందనుకోండి, ఒక దానిని ఆహారం తిందనుకోండి, మరొకదానిని చంపదు. ఏ జీవి అయినా సరే అంతే. కప్పైనా సరే అంతే. పామైనా సరే. పొట్ట నిండిన తరువాత మాత్రం, ఆకలి తీరిన తరువాత మరొక జీవిని అవి బాధించవు. కానీ ఒక్క దోమకే ఒక్క లక్షణం ఇచ్చాడు, ఏమిటది? కుట్టడమే దాని పని. అంటే దానిలోపల వున్న ప్రేరణ ఎలా వుంటుందంటే, ఆ ఆ సందర్భం వచ్చినప్పుడు అది కుట్టుకుండా వుండలేదన్నమాట.
మనలో కూడా ఇప్పుడు ఈ లక్షణం వుందా? లేదా?

                                   ఆ సందర్భం వచ్చినప్పుడు ఎదుటివారిని కుట్టకుండా వుండము మనము. మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, హావభావముల చేత కానీ (body language also), వాడిని ఏమీ అనం. కానీ ఏం చేస్తాము? ఎదో అత్తమీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు చెంబు పగలేస్తావు. అప్పుడు ఏమైంది? హావభావాల ద్వారా చెప్పినట్టేనా కాదా?
కాబట్టి ఈ వేదన కలిగించే లక్షణము సత్వగుణంలో వుందా?
లేదు.
అది (వేదన కలిగించే లక్షణము) ఎందులో వుంటుంది?
రజోగుణ, తమోగుణ ధర్మలలోనే (వేదన కలిగించే లక్షణము)  వుంటుంది.
సాక్షిత్వం లో వుందా?
సత్వగుణంలోనే లేకపోతే, సాక్షిత్వంలో ఎలా వుంటుంది?
కాబట్టి, ఎప్పుడైతే మనం ఇతరులకు వేదన కలిగిస్తామో, వాళ్ళల్లో మనం ఏరకమైన భావాన్ని కలిగించాము ఇప్పుడు?
ఓహో! వీడు మనిషిరూపంలో వున్నటువంటి (జంతువు) దోమ. జంతువుకాదు. దోమ. సో.. దోమ కుడితే ఏం చేస్తారు మీరు?
(చంపేస్తాము) ఫట్టుమని కొడతావు దానిని. అవునా కాదా? చంపాలని కాదు నీ వుద్దేశ్యము. ఛస్తుందా బ్రతుకుతుందా (is not your criteria) ఈస్‌ నాటు యువర్‌ క్రీటీరియా. అవునా? కాదా?
ముందు కుట్టిన చోట ఏం చేస్తావు?
దెబ్బవేస్తావు.
ఆ దెబ్బకు అది ఏమౌతుంది?
వుంటే వుండచ్చు, పోతే పోవచ్చు.
అప్పుడు మనలో కూడా ఏ రకమైన భావ ప్రకంపనలు కలిగినాయి?
(రజస్సు, తమస్సు) Same సేమ్‌, అర్థమైందా అండీ!
అంటే మనలో ఇది (innate) ఇన్నేట్‌గా వుందా? లేదా?
(Natural) నాచ్యురల్‌గా వుంది. కాబట్టి అంటే ఈ సృష్టిలో..
మనమందరం విజ్ఞాన శాస్త్రంలో ఏం చదువుకున్నాము?
(Action is equals to Reaction) యాక్షన్‌ ఈజ్‌ ఈక్వల్స్‌టు రియాక్షన్‌. అని చదువుకున్నామా? లేదా? అది ఏ దృష్టితో చెప్పారు అసలు?

                                   భౌతికమైనటువంటి పదార్థ దృష్టితో చెప్పలేదు. ఇదిగో ఈ సూక్ష్మ శరీరంలో వున్నటువంటి గుణప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు.
అన్ని యాక్షన్లు ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఇప్పుడు?
ఆ మూడు గుణాలనుంచే పుడుతున్నాయి.
కాబట్టి రియాక్షన్‌ కూడా ఏ గుణ ధర్మంతో వస్తుంది?
ఆ గుణ ధర్మంతోనే వస్తుంది. అర్థమైందా అండీ!
ఇప్పుడు ఎదుటివారు నన్ను విమర్శించారు అంటే రజోగుణ ధర్మంతో కాబట్టి యాక్షన్‌ ఈజ్‌ ఇక్వల్‌ టు రియాక్షన్‌ కాబట్టి నేను కూడా వాడిని... వాడు నాకు వేదన కలిగించాడు, నేను కూడా వాడికి వేదన కలిగించాను అన్నావనకుకోండి. అప్పుడు మనం ఏ స్వరూపం అయ్యాము?
(దోమ.) సేం ప్రాబ్లం (same problem).
నువ్వు వాడిని అలా చూస్తే, దోమగా చూస్తే, వాడు నిన్ను ఎలా చూస్తాడు?
నువ్వు వేదన కలిగించనప్పుడు?
సేమ్‌ (same). అప్పుడు మానవదేహం అనేటటువంటి లక్షణం వుందా?
మనుష్యత్వం అనే లక్షణంతో వున్నామా? మనం అప్పుడు?
లేము కదా!
కాబట్టి మనం మనసా, వాచా, కర్మణా ఎవరినైనా ఇలా బాధించాలనే లక్షణం మనలో రాగానే... అసలు ఇప్పుడు క్షమత ఎక్కడ కలివుండాలి మనం?
క్షమత బహిరంగమా? అంతరంగమా?
(అంతరంగం)

కానీ మనం ఇప్పుడు మనం ఎక్కడ వ్యవహరిస్తున్నాము?
వాడేదో నాకు చేశాడండీ, నేను వాడిమీద ప్రతీకారం తీర్చుకోకుండా క్షమించేశానండి. అంటున్నావా? లేదా? కానీ ఎక్కడో దోషం లేదూ?

వాడి సూక్ష్మ శరీరం అలా ప్రవర్తించడానికి, ఆ ప్రేరణ పొందడానికి కారణం ఏమిటి?
గుణ ధర్మం కదా!
మరి మనలో ఆ గుణధర్మం బలంగా వుండబట్టే కదా! మన చుట్టు పక్కల జీవులందరూ అలాగే తయారయ్యారు. అంతేనా?
రావణాసురిడి చుట్టూ రాక్షసులే వున్నారా? దేవతలు కూడా వున్నారా?
(రాక్షసులే వున్నారు)
ఆయన దేవతలను అందరిని జయించాడా? లేదా?
(జయించాడు)
తన సమర్థతతో, తన తపఃశక్తితో రావణాసురుడు అందరినీ జయించాడు.
జయించిన పెద్దమనషులు, దేవతలనందరినీ తన చుట్టూ పెట్టుకోవచ్చుగా?
పెట్టుకుంటే కనీసం ఏమయ్యే వాడు?
దేవతే అయ్యేవాడు. సహవాస బలం చేత అయినా గాని.
కానీ, తనలో వున్న గుణ ధర్మం చేత ఎవరిని పెట్టుకున్నాడు?
                                   రాక్షసులనే పెట్టుకున్నాడు. దేవతలనందరిని జయించి, మీరు సేవకులు పొండి అక్కడ మీ పనులు మీరు చేసుకోండి కానీ, నా ఆజ్ఞ ప్రకారము పని చేయండి అన్నాడు. కనీసం సృష్టి ధర్మాన్ని చెడగొట్టలేదు.
కానీ ఇవాళ మనమేమి చేస్తున్నాము?
సృష్టి ధర్మాన్ని మనం చేయనివ్వము. ఎవరి పని వాడిని చెయ్యనివ్వము.
ఏం చేస్తాము?
                                   నువ్వు అలా చేయకూడదు, ఇలా చెయ్యాలి. నువ్వు ఇలా చెయ్యకూడదు, అలా చెయ్యాలి. అంటే సృష్టి ధర్మాన్ని మానవబుద్ధికి అనుగుణంగా మార్చడం మొదలు పెట్టాము.
ఏమైంది అప్పుడు దానివల్ల?
                                   తమోగుణ ధర్మ కూడా, గాఢమైన తమోగుణ ధర్మంగా మారిపోయి, మేలుకొనే అవకాశం లేకుండా పోయింది. ఈ క్షమత అనే అంశము మేలుకునే అవకాశం లేదు ఇప్పుడు.
ఎప్పుడు మేల్కొంటుంది, అథవా మేల్కొన్నా కూడా?
                                   కుండ పగలేసినాక, సాంతం వాడిబుర్రో, వీడి బుర్రో బ్రద్దలైనాక, వాడికి వీడికి ఇద్దరికీ దుఃఖాలు వచ్చేసి, పెను సమస్యలు వచ్చేసి, పెను ప్రమాదాలు వచ్చేసి, చివరకి ఇద్దరు జీవితాలలో ఏదో ఒక జీవితం ఆగిపోయే దశకు వచ్చేసి, నువ్వు శుంఠ అంటే నువ్వు శుంఠ అనుకొని,
అసలు మీకు ఈ శబ్దానికి అర్థం తెలుసా? శుంఠతెలుసా ఎప్పుడన్నా?
తెలుగు శబ్దమా? సంస్కృ త శబ్దమా?
సంస్కృతం.
ఎందుకు పెట్టారు అలాగ? తెలుసా మీకు? అసలు దానికి అర్థముందా?
తెలుసా లేదా? ఈ పదం మీకు?
                                   కానీ మీరు ఎవరూ ప్రయత్నం చేయడం లేదండి. నేను మీ అందరిని అడిగేది అదే. ఎప్పుడూ, నేనెప్పుడు వచ్చినా మిమ్మల్ని అడిగేది అదే. నేను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారే వస్తాను, ఆర్నెన్నకొకసారో... వచ్చినప్పుడు
మీరు ఈ ఆరు నెలలు, సంవత్సరంలో ఏం అధ్యయనం చేశారు?
ఏం కొత్త తెలివితేటలు వచ్చాయి?
మీరు ఏం ప్రశ్నలు నన్ను అడుగగలుగుతారు?
                                   పోనీ నేను ఏం అడిగితే మీరు ఏం చెప్తారు అని చూస్తాను. కానీ మీరు ప్రతిసారీ ఒక్కతీరుగానే వుంటున్నారు. ఎదగడం లేదు మీరు. మీరు ఎప్పుడైనా నన్ను, టకటకా ప్రశ్నలతో వేయగలుగుతారేమో అని చూస్తా, అబ్బే! నేనే మిమ్మల్ని ప్రశ్నలు వేయడమే తప్పా, మీరందరూ నన్ను ప్రశ్నలు వేసే స్థాయికి ఎదగడం లేదండి. 1:20 ఇరవైమంది వున్నారు కదా! మేమూ మీలాగా సాధకులమే కదా! మీరూ మాలాగా సాధకులే. మీమీ సాధనలో, మీ అధ్యయనంలో, మీరు ఒక ఆరు నెలలో, సంవత్సరం పాటో, నన్న చూడడానికి టైం వచ్చినప్పుడు, ఈ కాలంలో మీరు ఏం అధ్యయనం చేశారు? ఏం ప్రశ్నలతో వస్తారని చూస్తాను. అంతే కదా! లేకపోతే నాతో పనుందా మీకేమన్నా? నో యూజ్‌ (No use). అంతేనా కాదా? కాబట్టి మీరు ఎప్పుడైనా సరే, నాతో మాట్లాడాలంటే, నా క్లాసుకి రావాలి అంటే, లేకపోతే నాతో మీకు ఏదన్నా ప్రయోజనము వుండాలి అంటే, మీరు అధ్యయనం చేసినటువంటి...
                                   అట్లా... అలా లేరు అనుకోండి, మీరు రెడీ అయి రాలేదనుకోండి, నా వల్ల మీకు పెద్ద ప్రయోజనము ఏమీ వుండదు.
ఆ.. ఈ శుంఠ అంటే అర్థం ఏమిటంటే, కార శబ్దం ఎక్కడెక్కడ వాడుతాం?
ఇప్పుడే నేనే చెబుతా పోనీ, ఈ కార శబ్దంతో మాటలు చెప్పండి చూద్దాం?
(ఠక్కున, కంఠం, పీఠం)
ఠావులు తెలుసా?
(పేపర్లా అండీ!) ఠావులు అంటే పేపర్లు కాదు. ప్రాణాలు. అర్థమైందా అండీ! అంటే, తత్సమ, తద్భవ శబ్దాలు రెండు వుంటాయన్నమాట. ఠావుల్‌ దప్పెను తనువండశ్యెను మూర్ఛ వచ్చెనుభాగవత పద్యం రాదు. అది వస్తే ఠావులు అంటే ప్రాణాలు అని తెలుస్తుంది. అర్థమైందా అండీ! మనకి ఏది బాగా స్ఫురిస్తుందో, ఎందుకు ఈ ఎక్సర్ సైజ్‌ (exercise) మీ చేత చేయిస్తున్నానంటే, మీ బుద్ధిలో ఏది స్ఫురిస్తుందో మీకు తెలియడానికి. ఒక నూతనమైన శబ్దం విన్నాము. మన బుద్ధి ఏం ఆన్సర్‌ (answer) చెప్పిందో మీరు ఇప్పుడు గమనించండి.
మీకు తెలియకపోతే ఏం చేసింది?
బ్లాంక్‌ (Blank).
బ్లాంక్‌ అన్నప్పుడు తెల్లకాగితం కనపడిందా? నల్లకాగితం కనపడిందా?
నల్లకాగితం కనపడింది. తెల్లకాగితం కనపడితే మీరు ఏమన్నా రాసే ప్రయత్నం చేస్తారు. నల్ల కాగితం కనపడితే, ఆ ప్రయత్నం కూడా చేయవు. ఇప్పుడు మీరు ఏమన్నా ప్రయత్నం చేశారా? ఠావులు అనంగానే, అది నాకు తెలియదు అంది అంతే...
తెలియదు అనంగానే ఏమైంది?
బ్లాక్‌ పేపర్‌ (black paper) వచ్చేసింది. బ్లాక్‌ పేపర్‌, బ్లాంక్‌ పేపర్‌ ఒక్క అక్షరమే తేడా. అర్థమైందా అండీ?
మనకు నిద్ర వచ్చినప్పుడు కూడా, ఏ పేపర్‌ వస్తుందండి?
(Black paper) బ్లాక్‌ పేపరే వస్తుంది. (Not blank paper) నాట్‌ బ్లాంక్‌ పేపర్‌.
అవునా కాదా?
అదే సాధకుడు అయినవాడికి?
(Black paper will become blank paper) బ్లాక్‌ పేపర్‌ విల్‌ బికమ్‌ బ్లాంక్‌ పేపర్‌. (Such that you can write something on it) అంచేత దానిమీద ఏదైనా రాయవచ్చు. అర్థమైందా అండీ?
అంటే గాఢనిద్రావస్థను అధ్యయనం చేయగలిగేటటువంటి సమర్థత వస్తుంది అప్పుడు అక్కడ. అదీ సాధన అంటే. అది మనకు ఏమన్నా వుపయోగ పడుతుంది.
ఎందుకని?
మరణావస్థలో కూడా ఏమి వస్తుంది?
(black paper) బ్లాక్‌ పేపరే వస్తుంది అప్పుడు కూడా.
కానీ అక్కడ కూడా ఏమి రావాలి?
(You should get blank paper) అర్థమైందా అండీ?
అప్పుడు ఏం చేయవచ్చు?
ఆ ఆ మరణానుభూతి సమయంలో కూడా, You can decide something.
ఎప్పుడు decide చేయగలుగుతావు?
(Blank Paper  వచ్చినప్పుడు)
ఎప్పుడు వస్తుంది?
క్షమత ఆ క్షమత వుండాలయ్యా!

ఈ క్షమయే జ్ఞానానికి మూలం. నీ లోపల బుద్ధి వికాసానికి మూలం క్షమ.

క్షమించడానికి ఒక ఉపమానం  చెప్పండి చూద్దాము?
జీసస్‌ (JESUS CHRIST).
ఊఁ.. ఆయన్ని బాగా శిలువ వేశారు, కొట్టారు, అది చేశారు, ఇది చేశారు, కానీ ఆయన ఏమన్నారు?
When he was crucified అంతేకాదా? Cross మీద ఎక్కించడాన్ని crucified, when he was crucified ఆయనేం చెప్పాడు?
దేవా! వీళ్ళు ఏంచేస్తున్నారో, వీళ్లు అజ్ఞానంతో చేస్తున్నారు, వీళ్ళకు తెలియదు, వీళ్ళు తెలియక చేశారు కాబట్టి, వీళ్ళని శిక్షించవద్దు, క్షమించు. అని అడిగాడు.
అదేనా క్షమించడం అంటే? ఇంకేమన్నా వుందా? Anything else?        
ఇంకేమన్నా ఉపమానాలు చెప్పండి చూద్దాము, క్షమించడానికి ఎవరైనా వుపమానం చెప్పండి చూద్దాము?
మహాత్మాగాంధీ కూడా క్షమించారు.
ఊఁ.. మహాత్మాగాంధీ కూడా క్షమించాడు, ఎలాగ?
ఒక చెంపను కొడితే, మరొక చెంపను చూపమన్నాడు ఆయన. ఎలాగ?
అది కూడా క్షమే. అంటే, ఆనాడు దేశభక్తితో జీవించేకాలంలో, అందరిని వాళ్ళు హించించేవాళ్ళు. హింసని ప్రతిఘటించాలి అంటే తక్కువ శక్తి కావాలి, సహించాలి అంటే ఎక్కువ శక్తి కావాలి. అర్థమైందా అండీ! ఈ హింసని ప్రతిఘటించాలి అంటే, తక్కువ శక్తి కావాలి. అదే సహించాలి అంటే, ఎక్కువ శక్తి కావాలి, ఎందుకు? Why?
(Pain) ఆఁ...
సత్వగుణానికి ఎక్కువ శక్తి కావాలి. సత్వగుణ అభ్యాసానికి, ఎక్కువ శక్తిని ఉపయోగించి మనం వాటిని అభ్యాసం చెయ్యాలి.
చేస్తే ఏమిటి ప్రయోజనం?
 చిన్నప్పుడు...  ఇప్పుడు మీరందరూ బాగా పెద్దవాళ్ళు కదా!
ఇప్పుడు ఎంత అన్నం తిన్నారో, చిన్నప్పుడు కూడా అంత అన్నం తిన్నారా?
(లేదండి)
తినలేదా? ఏ?
(Capacity లేదు కాబట్టి) ఆఁ.. అప్పుడు అంత ప్రాణశక్తి లేదు. ఇప్పుడు ప్రాణశక్తి బాగా వికాసము పొందింది. అంతే కదా! ప్రాణశక్తిని బట్టే కదా ఆకలి. ఆ ఆకలిని బట్టే ఆహరం స్వీకరించడము. క్రమేపీ అభ్యాసము చేసే కొద్దీ, ఈ ఇంద్రియధర్మాలు ఎలా వికాసము పొందినాయో, అట్లాగే మనలో వున్న బుద్ధికూడా వికాసము పొందాలా వద్దా?
(పొందాలండి.)
ఆఖరి వికాసము ఏమిటి మనకి?
ఆ బుద్ధి వికాసమే (ఆఖరి వికాసము).
ఇంద్రియ ధర్మాలలో ఆఖరికి వికసించేది ఏది?
బుద్ధి వికాసము.
ఇప్పుడు క్షమించడం అనే లక్షణము, శరీర వికాసములో వేద్దామా? ప్రాణ వికాసములో వేద్దామా? మనో వికాసములో వేద్దామా? విజ్ఞానమయకోశ వికాసమైనటువంటి బుద్ధి వికాసములో వేద్దామా?
(విజ్ఞానమయ కోశం) అంతేనా? కాదా?
ఏమన్నా శరీర వికాసంలో వేసి చూద్దామా? శరీరానికి అంత బుర్ర లేదుగా. క్షమించడమా, అంతశక్తి లేదు దానికి. కాబట్టి ఇట్లా గమనించి చూస్తే, సత్వగుణ అభ్యాసం చేసేటప్పుడు మనకి బాగా శక్తి ఖర్చు అయిపోతుంది. అభ్యాసకాలంలో.

అదే సత్వగుణం నీకు సిద్ధించింది. సహజమయ్యింది. నువ్వు మూడు అవస్థలలో కూడా సాత్వికంగా వుండగలుగుతున్నావు. అప్పుడేమయ్యింది?
You are the potent energy. శక్తికి నీవే కేంద్రం అవుతావు అప్పుడు. అర్థమైందా అండీ!
                                   కాబట్టి ఈ క్షమ అనే దాని వల్ల, You will be the energy source. You will be the energy centre.
మనలో శక్తి పెరగాలంటే ఏం చెయ్యాలయ్యా?
ఈ క్షమత వుండాలి.
క్షమతకు అసలు ఉపమానం ఏమిటో తెలుసా? ఎవరైనా చెప్పండి చూద్దాం?
సరియైన ఉపమానం వుండాలండి. కరెక్టుగా కొడితే కరెక్టుగా 100కి 1000 మార్కులు పడేటట్టుగా వుండాలండి ఉపమానము. సముద్రము.
సముద్రము ఎప్పుడైన ప్రతీకారము తీర్చుకుంటుందా?
ఎప్పుడన్నా చెలియలి కట్ట దాటుతుందా?
దాటదు.
ఎన్ని నదులు వెళతాయండి?
(అన్నీ!)
ప్రపంచంలో వున్నదంతా ఎందులోకి పోతుంది?
(సముద్రంలోకి.)
ఎందుకని?
అందులోంచే వచ్చింది కాబట్టి.
సముద్రవసనే దేవీ, పర్వతస్థనమండలే, అంటున్నామా లేదా?
భూమాతకు శ్లోకం ఏమిటి?
సముద్రవశనే దేవి ఆవెడ. మొదట్లో ఒకప్పుడు సముద్రంలో వుండేది.
కానీ
విజ్ఞానం ఏం చెబుతోంది? వైజ్ఞానికంగా ఏం చెబుతోంది?
భూమి మీద సముద్రము వుంటుంది అంటున్నారు.
ఏమిటి, ఎక్కడో contra వుంటుంది, ఏది కరెక్టు?
(భారతీయులం కాబట్టి మనవాళ్ళు చెప్పిందే కరెక్టండి)
అబ్బా!
                                   ఇక్కడొక రహస్యం వుందండి. పూర్వం వాళ్ళు ఏం చెప్పినా కూడా, అంటే మనకు ఇప్పుడు ఆ భాష అందుబాటులో లేకపోవడం వల్ల, దాని వ్యుత్పత్తి అర్థాలు తెలియక పోవడం వల్ల, దానిలో వున్న రహస్యాలను శోధించే బుద్ధి వికాసం లేకపోవడం వల్ల, ఇలా తయారయ్యాం అన్నమాట. Actual గా వాళ్ళు చెప్పడంలో వుద్దేశ్యం ఏమిటంటే, సముద్రం అంటే నీళ్ళతో వున్న సముద్రం గురించి చెప్పడం లేదు. అది నీళ్ళతో వున్న సముద్రము, మన కళ్ళతో భౌతికంగా చూసిన సముద్రము గురించి మాట్లాడడం లేదు వాళ్ళు.
పాల సముద్రము అంటే ఎక్కడ వుందండి?
(వైకుంఠము, వ్యోమము)
పాల సముద్రము అంటే ఎక్కడుంది? Where is సముద్రము?
ఎక్కడన్నా ఈ ప్రపంచంలో పాల సముద్రము వుంటుందా ఎక్కడన్నా?
నీళ్ళ సముద్రాలు వుంటాయి కానీ, పాల సముద్రాలు వుంటాయా? ఎక్కడన్నా?
మరి ఎందుకండి అలా చెప్పారు? పాల సముద్రం వుంటుంది. దాంట్లో ఆయనెవరో పడుకుని వుంటాడు (ఆది శేషుడు). అలా పొడుకుని వున్న ఆయన మీద  ఇంకొకాయన పడుకుని వుంటాడు (విష్ణుమూర్తి). అని చెప్పారా? లేదా?
ఏమిటి దాని శ్లోకం?
శాంతాకారం, భుజగ శయనం, పద్మనాభంవచ్చుకదా ఈ శ్లోకం అందరికి, దరిదాపుగా అందరికి వచ్చు, అందూ వినే వుంటారు దీనిని.
(మొన్న దర్శనం జరిగినది అన్నారు ఇదే కదా స్వామీ!)
శాంతాకారం అంటే ఏమిటి ఇప్పుడు?
అసలు శాంతానికి గుర్తు ఎవరు అంటే సముద్రము. అర్థమైందా అండీ! అంటే ఏమిటి? త్రివిధ తాపములు లేనటువంటిది శాంతం. క్షమత అన్నా కూడా అదే అర్థం.
ఈ శాంతము ఆ క్షమత అనేవి దగ్గర దగ్గరి అర్థాలన్నమాట. అర్థమైందా అండీ! కాబట్టి,
ఈ త్రివిధ తాపాలకి మనం పొంగక, కుంగక, లొంగక వున్నట్లయితే, మనతో క్షమత వున్నట్టు. అప్పుడు మనం ఎవరు?
                                   ఆ విశ్వ చైతన్య కేంద్రంగా మారే అవకాశం వుంది మనకి. మనలో వున్నటువంటి విశ్వ చైతన్య కేంద్రం మేల్కొని, ఈ మేల్కొన్నటువంటి విశ్వచైతన్య కేంద్రం, హృదయస్థానంలో వుంది కాబట్టి, ఇది బయట వున్నటువంటి విశ్వచైతన్య కేంద్రంతో అనుసంధాన పడుతుంది.  అర్థమైందా అండీ! దీన్నే మరొక మాటల్లో చెప్పాలి అంటే, బయట అంతా విశ్వప్రాణం వుంది. మనలోపల వ్యష్టిప్రాణం వుంది. ఈ వ్యష్టిప్రాణం, ఆ విశ్వప్రాణంతో అనుసంధానపడాలి. ఆ అనుసంధానపడే విద్యల పేర్లే ధ్యానం, యోగం, etc. ఎన్నిపేర్లన్నా చెప్పుకోండి. ఈ రెండూ సమన్వయ పరచడం, ఈ రెండిటిని ఒకే సూత్రం మీద సమన్వయ పరచడమే...  నవవిధ భక్తి మార్గాలు అదే, ధ్యానమార్గం అదే, యోగమార్గం అదే, అన్నీ అదే!
Ultimate గా ఇవి రెండూ ఒకే సమన్వయంలోకి వచ్చినప్పుడు, మనలో ఏమి ఏర్పడింది? 
శాంతకారం. అర్థమైందా అండీ!
ఇప్పుడు మన గెలాక్సీ Milky way వుందా? లేదా? పైన పాలపుంత అని చెబుతున్నామా? లేదా? ఆ గెలాక్సీ మిల్కీ వే లో ఈ త్రివిధ తాపాలు వున్నాయా? ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక తాపాలు వున్నాయా? వున్నాయా?
(లేవు.)
ఎందుకని?
అక్కడ జీవులు లేవు. అంతా పదార్థమయము, శక్తిమయము. అయితే పదార్థమయము. లేకపోతే శక్తిమయము. రెండే వున్నాయి. అంతే. ఈ రెండిటి మిశ్రితంగా వున్న జీవులు మనం. మనలో పదార్థము వుంది, శక్తి కూడా వుంది. రెండూ ఒక proportion తో balance అయ్యింది కాబట్టి, మనం ఇట్లా ఆకారంతో కనబడుతున్నాము.
ఈ రెండిటిలో శక్తి యొక్క ప్రభావం పెరిపోయిందనుకోండి, ఏమౌతుంది?
పదార్థ విస్ఫోటనం జరుగుతుంది. అర్థమైందా అండీ!
శక్తి యొక్క బలం పెరిగితే ఏమౌతుంది?
పదార్థ విస్ఫోటనం జరుగుతుంది. ఈ body పోతుంది. అంతేనా అండీ!
శక్తి యొక్క బలం తగ్గింది. పదార్థ బలం పెరిగిపోయింది.
అప్పుడేమయ్యింది? అప్పుడు ఏమయ్యాము?
వికలాంగులం అయ్యాము.
ఉన్నాయి కానీ, పనిచెయ్యవు. అర్థమైందా అండీ!
అన్నీ వున్నాయి కానీ, అవి పనిచెయ్యవు. కారణం ఏంటి?
శక్తి యొక్క బలం తగ్గింది. పదార్థ బలం పెరిగింది.
ఈ రెండు ఒక సమతౌల్యంలో వున్నాయి ఇప్పుడు మనలో.
వున్నాయా? లేవా?
వున్నాయి కాబట్టే శుభ్రంగా తింటున్నావు, శుభ్రంగా గుండ్రాయి తిని, మరునాటికల్లా హరించుకుంటున్నావు. అవునా కాదా?
బోల్లెడు మందులు వేసుకుంటే కానీ, నాలాగా అరగని వాళ్ళు బోల్లెడు మంది లేరా?
వున్నారా? లేరా?
డాక్టరు దగ్గరకు వెళ్ళి, ఏవండి ఆ problem అండీ, ఏవండి ఈ problem అండి, ఏమండి దానికి మందండి. దీనికి మందండి. అంటే అట్లా వేసుకునే వాళ్ళు వున్నారా లేరా? మరి ఇవేమీ లేకుండా, శుభ్రంగా భోంచేసుకుని, మర్నాటికి శుభ్రంగా అరిగించేసుకునే శక్తి మనలో వుందంటే, అది శక్తేనా కాదా?
(శక్తియేనండి)
లేకపోతే, డాక్టరు దగ్గరకు వెళ్తే ఏం చెబుతాడు?
అరుగుదల శక్తి తగ్గిందండి, పదార్థమా? శక్తియా ఇప్పుడు అది?
శక్తి.
కాబట్టి మనలో ఇప్పుడు ఏమున్నాయి?
శక్తి వున్నది, పదార్థము వున్నది. ఈ రెండు స్పష్టమయినటువంటి సమన్వయంలో వున్నాయి. ఈ సమన్వయపరుస్తున్నది ఎవరు అసలు?
(చైతన్యము) అది. ఆ చైతన్య కేంద్రమే నీ హృదయం.
ఈ రెండింటిని ఎవరు సమన్వయ పరుస్తున్నారయ్యా?
మీ అమ్మా? మీ నాయనా? లేకపోతే వైకుంఠంలో వున్న విష్ణుమూర్తియా?
లేకపోతే కైలాసంలో వున్న శివుడా? అంటే కాదు.
నీ హృదయస్థానంలో వాళ్ళయొక్క సరాసరి కేంద్రం ఒకటి వుంది.
అదే చైతన్యము. అర్థమైందా అండి?
అది మనల్ని ఏం చేస్తోంది?
Balance create చేస్తోంది. ఇది కూడా క్షమతయే. ఈ రెండూ balanced గా, సమంగా వుండడం కూడా క్షమతయే. ఎప్పుడైతే ఇది అటూ ఇటూ అయ్యిందో, అన్ని తేడాలు వచ్చేస్తాయి. రావా? వెంటనే వచ్చేస్తాయి. అట్లా ఈ క్షమత అన్న అంశం, నువ్వు తల్లి గర్భస్థానంలో, స్థానం సంపాదించిన దగ్గరనుంచి మొదలుపెడితే, మృత్యుస్థానము వరకూ కూడా, జీవితం అంతా పరుచుకుని వుంటుంది. అందుకని ఆ క్షకారముతో ఎన్నో పదాలు వేశారు. అర్థమైందా అండీ!
కాబట్టి ఆ శాంతాకారం అన్నటువంటి స్థితిని మనం, విష్ణుమూర్తి యొక్క ప్రాథమిక, మొదటి స్థితి ఏమిటి? శాంతాకారం. అంటే ఆ విశ్వం ఎట్లా అయితే, తనంతట తాను భ్రమిస్తూ, తనచుట్టూ తాను భ్రమిస్తూ, ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక తాపాలకు లొంగక, పొంగక, కుంగక ఎలా వున్నదో,
అదే విశ్వచైతన్యం నీలోకూడా వుందా లేదా?
వుంది కదా!  
మరి ఈ రెండూ నీకు ఎందుకు సమన్వయ పడడం లేదు?
Something is wrong. దానిని, దీనిని balance చేసుకోవడం మనకు రావడం లేదు. ఏమండి ఆయనే బ్యాలెన్స్‌ చేసి ఇచ్చేసేయచ్చుకదా! మాకు ఈ గొడవంతా ఎందుకు? ఆయనే ఆ పని ఏదో చేసేస్తే, మా పని మా సమస్య పరిష్కారం అయిపోతుంది కదా! ఇది మీరు రోజూ కోరుకునే, లెంపలు వేసుకోవడం, నన్ను క్షమించేసేయి నాయనా! నన్ను క్షమించేసేయి. ఈ లెంపలు వేసుకునే business ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఇది అది సమన్వయం చేసుకోవడం రావడం లేదు. దీనని దానికి ట్యూన్‌ చేయాలి. దానిని దీనికి ట్యూన్‌ చేయాలి. అరవిందులు ఏమంటారంటే, దానిని ఇక్కడికి ఆహ్వానించవయ్యా.

సముద్రములోంచి ఉప్పు వచ్చిందా? ఉప్పులోంచి సముద్రము వచ్చిందా?
(సముద్రము లోనుంచే ఉప్పు వచ్చింది)
అంతేనా?
Ultimate గా ఉప్పు వెళ్ళి ఎందులో కలిసిపోవాలి?
(సముద్రంలో కలిసిపోవాలి) కలవాలి కదా!
సముద్రం వచ్చి టీ గ్లాసులో పడాలి అంటే?
అది సాధ్యపడదు. అవునా కాదా?
మీ ఇంట్లో వంటిట్లోకి, సముద్రం వచ్చి వంటల్లోకి పడాలండి? కుదురుతుందా? అదే ఉప్పు అయితే?
(ఉప్పు అయితే కుదురుతుంది) అది.

అనంత విశ్వచైతన్యంగా వున్నదేమో సముద్రం,
ఆ అనంత లక్షణాన్ని సూచించటం సముద్రం.
అంతేగాని నీళ్ళతో వున్నది కాదు సముద్రం.

సముద్ర వసనే దేవీ, దేవిఅంటే ఏమిటి? దివ్యత్వం అనేనా?
మరి దివ్యత్వాన్ని సూచిస్తూ ఇక్కడ మట్టి అంటావేమిటి?
సముద్ర వసనే దేవీ అనంగానే మనకు ఏం స్ఫురించిందండి?
నీళ్ళల్లోంచి మట్టి వచ్చిందనుకున్నాము.
నీళ్ళల్లోనుంచి మట్టి వచ్చిందని చెప్పాడా? అక్కడెక్కడన్నా?
చెప్పలేదు కదా!

                                   అనంతంగా వున్న విశ్వచైతన్యములో, ఒక దైవీ ప్రణాళికతో కూడినటువంటి స్ఫురణ కలిగింది. ఈ దివ్యత్వము స్ఫురించింది. అదేగా నువ్వు ఓంకారం అంటున్నావు. దాన్నే ఓంకారం అంటున్నావు. ఆ దైవీ స్ఫురణ, ఆ దివ్యత్వ స్ఫురణయొక్క ప్రాథమికమైనటు వంటి స్థితిలో, బిందు స్థితిలో, అది ఓంకారమై వున్నది. అదే ప్రణవమై వున్నది. అది సముద్ర వసనే దేవీ, ఇప్పుడు మనకు ఏమి అర్థమైనాయి, మనము రోజూ చదువుకునే శ్లోకాలు? అర్థమైందా అండి. ఇప్పుడు?

                                   అందుకనే చెప్పేది నేను, అర్థం కాకుండా చేసే ప్రయత్నమంతా వాచా వేదాంతంగా మిగిలిపోతుంది. మనలో ఆ భావన వుండదు. అదే ఇట్లా చూడండి, ఇప్పుడు. శాంతాకారం, భుజగ శయనం  ఇప్పుడు అర్థమౌతుంది.

భుజగశయనం అంటే ఏమిటి? మామూలుగా వాచ్యార్థం ఏమిటి?
పాము మీద పడుకున్నాడు.
అలాగ అక్కడ చెప్పాడా?
భుజగ శయనం – అనంతంగా వున్నటువంటి సర్పాకృతిలో ఆ విశ్వచైతన్యం అంతా తనచుట్టూ తాను తిరుగుతోంది. Double helix అదేగా జీన్‌ ధియరీకి అనుకున్నాం. Double helical theory. ఆ డుబుల్‌ హెలిక్స్‌ ఒకదానితో ఒకదానితో ఒకటి మెలికలు కలసి తిరిగి, ఆ అనంతుడి యొక్క తోక ఎక్కడో, తల ఎక్కడో తెలుసుకోవాలంటే వీలు కాదట.
ఈ భుజగ శయనం అంటున్నామే, ఈ భజగం ఎవరు?
అనంతుడు.
ఆ అనంతం అనే సర్పం యొక్క తోక ఎక్కడో, తల ఎక్కడో తెలుసుకోవాలంటే వీలు కావక్కర్లేదట. అంత అనంతంగా వున్నదట. అంటే దాని అర్థం ఏమిటి? ఈ డబుల్‌ హెలిక్స్‌ ఇట్లా మెలితిరిగిపోయి వున్నాయి. స్పేస్‌ అండ్‌ ఎనర్జీ అని అక్కడ అట్లా రెండూ కలిసిపోయి వున్నాయి. ఆ రెండూ ఏమిటవి? Space & Energy. అవి రెండూ అట్లా కలిసిపోయివున్నాయి అక్కడ. కలిసిపోయి వున్నదాంట్లో భుజగ శయనం,
శయనం ఏమిటండీ మళ్లా?
లేచాడు, పరుగెట్టాడు అనవచ్చుగా.
శయించుట, మీరు అందరూ ఎక్కడ శయనిస్తారు రోజూ?
(మంచం మీద)
మంచం మీద శయనిస్తావా? ఎక్కడ శయనిస్తారు?
మీ ఇంట్లో... నువ్వు ఎక్కడ వుంటే అదే కదమ్మా నీ ఇళ్ళు.
నువ్వు ఎక్కడ పడుకుంటావు?
నీ ఇంట్లో.
ఆఁ.. ఈ double helical theory మధ్యలో ఒక energy వుంది. మళ్ళా. ఆ energy శయించుట అంటే ఆశ్రయము. ఆ ఆశ్రయంగా ఒకాయన వున్నాడట.
ఎవరాయన? తరువాత ఏంటి?
శాంతాకారం, భుజగ శయనం, పద్మానాభం. ఇదేమిటయ్యా?
Comedian పద్మనాభం కాదు. పద్మనాభము అంటే ఏమిటి?
పద్మము అంటే,
(అంటనిది, దేనికి అంటనిది) పద్మము అంటే ఏమిటి?
పద్మనాభి అని ఎందుకు అన్నారు?
ఎందుకని? ఎలా? దానిని ఎలా అన్వయిస్తారు?
ఎప్పడూ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ప్రతీకాత్మకమైన బోధన అంటారు దీనిని.
అంటే అర్థం ఏంటి? ఇందాక నుంచి ఏం చెబుతున్నాను మీకు?
ఒక ఉపమానం వుండాలి మీ చేతిలో. ఈ ఉపమానంలోనుంచి ఒక లక్షణాన్ని ఏరాలి మనం. ఏరినప్పుడు ఏమౌతుంది?
ఈ లక్షణము దృష్ట్యా ప్రపంచాన్ని చూడటం వస్తుంది.
ఈ లక్షణము దృష్ట్యా సృష్టిని అధ్యయనం చేయడం వస్తుంది.
ఈ లక్షణము దృష్ట్యా నీ జనన మరణాలను అధ్యయనం చేయడం వస్తుంది.
అప్పుడు నీలో ఏమైంది?
ఆ లక్షణం స్థిరపడింది.
లక్షణం ఎప్పుడైతే స్థిరపడిందో అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది.
అంతే గాని, మిగిలిన అంశాలను పట్టుకుంటే రాదు. అర్థమైందా అండీ!
ఇప్పుడు క్షమ అనేది పదార్థమా? లక్షణమా? శక్తా?
లక్షణము అది, అది పదార్థము కాదు, శక్తి కాదు. అర్థమైందా?

సాక్షిత్వములక్షణమా? పదార్థమా? శక్తా?
లక్షణము.
                                   అలాగే, మనం చేయగా చేయగా ప్రయత్నం చేయగా, నువ్వు భక్తి మార్గంలో ప్రయత్నం చేయి, కర్మమార్గంలో ప్రయత్నం చేయి, యోగ మార్గంలో ప్రయత్నం చేయి ultimate result ఎక్కడికి రావాలి నువ్వు?

                                   ఈ క్షమత అన్న స్థితికి రావాలి. ఆ సాక్షిత్వం అనే స్థితికి రావాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆ విశ్వచైతన్యం అంటే ఏమిటో, ఈ వ్యష్టి చైతన్యం అంటే ఏమిటో, అనుభూతమై ఈ రెండూ ఒక్కటే అన్న స్ఫురణ కలగడమే ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే. వేరే ఏమీ లేదు.

ఈ రెండూ synchronize అయ్యి ఒక్కసారి touch అయినప్పుడు ఏమౌతుంది?
రెండు మేఘాలు ఇట్లా కొట్టుకున్నాయండి. ఏమౌతుంది?
మెరుపు వస్తుంది. అర్థమైందా అండి!

                                   అట్లాగే, మన చుట్టూ వున్నటువంటి అనంతమైనటువంటి చైతన్యము, మనలో వున్న వ్యష్టి చైతన్యము, ఒకే సూత్రం మీదకు ఎప్పుడైతే వచ్చేసినాయో, ఈ రెండూ ఒకే సారి నీకు స్ఫురిస్తుందన్నమాట. ఇది ఒక్కటే అన్న స్ఫురణ కలుగుతుంది. ఆ స్ఫురణ కలగడమే ఆత్మసాక్షాత్కార జ్ఞానమంటే. ఆ దృష్టి వచ్చేస్తుంది అప్పుడు నీకు. అరె! ఇంకెప్పుడు అదే కనబడుతుంది నీకు. అర్థమైందా అండీ! ఔనా కాదా?

నీకు రోజువారి ఇప్పుడు జీవితంలో, బజారులో వెళ్తున్నావండి. నీలోపల ఒకటి ఆసక్తి పనిచేస్తూ వుంటుంది. ఏం చేస్తావు?
                                   ఎన్నన్నా కనబడని అదే వెతుకుతూ వుంటావు. అవునా కాదా? అక్కడ కూడా అంతే. ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానం అనే వికాసము వచ్చేసేప్పటికి, బుద్ధి అటుతిరిగిపోతుంది. అటు తిరిగిపోయి, ఆ దృష్టితోనే చూస్తుంది. ఎక్కడైనా సరే, ఈ సాక్షిత్వం వుందా లేదా?
                                   ఆ సాక్షిత్వ దృష్టితోనే చూస్తుంది అంతే. అన్యాన్ని ఏం చేస్తుందంటే, నాకు అవసరం లేదు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు?
ఏదో ఒక ఆసక్తి కలిగిన అంశాన్ని పట్టుకున్నావు. మిగిలిన వాటిని ఏం చేశావు?
                                   ఇదే అభ్యాసాన్ని అక్కడ కూడా చేస్తావు. కానీ, నేను ఆత్మ స్వరూపుడనే స్పృహతో చేస్తావు. ఇందాకడి నుంచి నేను అనుభూతి, అనుభూతి అని ఎందుకు అంటున్నానంటే ఇందుకు.

క్షమించ బడిన అనుభూతి వుందా మనకి? క్షమించిన అనుభూతి వుందా?
ఈ రెండిట్లో మనలో ఏది బలంగా పనిచేస్తుందండి?
క్షమించబడటమా? క్షమించడమా?
(క్షమించడం)
                                   క్షమించినప్పుడు నీలో సాత్విక అతిశయం వస్తుందన్నమాట. ఆ సత్వగుణాధిక్యం కలుగుతుంది. తద్వారా నీకొక వికాసము వస్తుంది. బుద్ధికి. అంతకంటే తక్కువ స్థాయి వేదనలు ఏమి వచ్చినా సరే, నిన్నిక ఏమీ చేయలేవు. అర్థమైందా అండీ!
                                   భక్తలందరికీ బాగా కఠిన పరీక్షలు వచ్చినట్లు మనకు పురాణాలు, కథలు చెబుతున్నాయి కదా! ఎందుకు?
                                   ఇదే, ఈ సత్వగుణాధిక్యాన్ని పెంచాలనే, ఆ జీవనం అంతా అట్లా ఈశ్వర కృపగా, ప్రకృతి వరప్రసాదంగా, అమ్మ దయ అంటే ఇదే. చాలా మందికి తెలియదు. అమ్మ దయ వుంటే అంతా అయిపోతుంది. అమ్మ దయ వుంటే అంతా అయిపోతుంది.
అమ్మదయ వుంటే ఏమౌతుంది?
మనలో క్షమతపెరుగుతుందన్నమాట. (కష్టం కాదు అది) ఆ క్షమా శీలత పెరుగుతుంది.
(క్షమాశీలత) ఎంతగా పెరుగుతుందయ్యా? అంటే,
దానిముందు మరణం చిన్నది అయిపోతుంది. అది ఎంతగా పెరగాలి అంటే, మరణం, మరణ వేదన అనేది అతి చిన్నది అయిపోతుందన్నమాట. అర్థమైందా అండీ!
మీరందరు ఇక్కడ చాలా మంది తల్లులు వున్నారు. సీజేరియన్‌ అయిన తల్లులు వున్నారు.
ఆ ప్రసవ వేదన, వేదనాభరితమేనా? కాదా? అవునా? కాదా?
మీ పిల్లలు మిమ్మల్ని బాధిస్తుంటారా? లేదా? చిన్నప్పుడు. పెద్దవాళ్ళు అయినాక బాధించడం వేరే విషయం.
చిన్నప్పుడు బాధిస్తుంటారా? లేదా?
వాడు బాధించినప్పుడల్లా ఏం చెబుతూ వుంటావు?
ఓహ్‌! నిన్ను కన్నప్పుడే బోల్లెడు వేదన పడ్డానురా బాబు, ఇప్పుడేముంది?
కానీ, సరేలే కాని! ఇవన్నీ చిన్న చిన్నవి వాటి ముందు అంటాం.
అవునా కాదా? ఎందుకని?
క్షమాశీలతవచ్చేసింది నీకు అక్కడ, అందువల్ల నీవు మాతృదేవతవు అయ్యావు.
వేదనా భరితమై వున్నప్పటికీ కూడా, నువ్వు మరొక జీవికి ఆధారభూతమవ్వాలనే క్షమత, నీలో పనిచేసింది. తద్వారా నీవు మాతృదేవతవు అయ్యావు. అప్పుడు నిన్ను 64,000 మాతృకా గణాలు నిన్ను ఆశ్రయించినాయి. తద్వారా నీలో ఆ దివ్యత్వము ఆవిష్కారమయ్యింది. తద్వారా ఆ జీవికి నువ్వు జన్మనిచ్చావు. ఈ సత్యాన్ని మనం అనుభూతిలో ఆనాడే మనం తెలుసుకుని వున్నట్లయితే, మీ అందరిలో కూడా ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులన్నీ పనిచేసి, ఆది శక్తి స్వరూపాలుగా మీకు దివ్యత్వం అనుభూతి అయ్యుండేది. నిజానికి వివాహ వ్యవస్థ అందుకోసం ఏర్పాటు చేయబడింది. అర్థమైందా అండీ! ఆడవాళ్ళకు మాతృత్వం మించిన వరం లేదని చెబుతుంది ఎప్పుడూ కూడా. అమ్మ అనిపించుకొనుట కంటే, స్త్రీ మూర్తికి గౌరవం లేదు,
ఎందుకు గౌరవం లేదు? ఎందుకని అలా చెప్పారు?
అంటే, ఆ దైవీ లక్షణాలని నువ్వు అప్పుడు గమనించ గలిగేటటువంటి, ఆ వేదన వల్ల నీలో ఒక వికాసం వస్తుంది. ఒక బుద్ధి వికాసము ఏర్పడుతుంది.
ఎంత వికాసము ఏర్పడుతుంది అంటే?
తరువాత జీవితంలో ఏర్పడే ఏ వేదనైనా కానీ దానిముందు తక్కువే అయిపోతుంది. ఇక నిన్ను అవి బాధించవు. అరె! అంత పెద్ద కష్టమే పడి వాడిని కన్నానే, ఇంత చిన్న విషయము, పెద్ద విషయమేమి వుంది? అని తల్లిగా క్షమించేస్తావు. క్షమాశీలత నీకు సహజమై పోయింది. అప్పుడు దివ్యత్వము నీలో సహజమై వున్నది కదా! అది మాతృదేవత అంటే మరి.
ఇప్పుడు మనం అలాగే వున్నామా? ఆలోచించి చూడండి!
(మరి పురుషుల కండీ?)
ఈశ్వరత్వము వుంది వీడిలో, అర్థమైందా అండీ? సాక్షిత్వం వుంది ఇందులో. నీవేమో (స్త్రీ మూర్తులు) క్షమాశీలత వల్ల దివ్యత్వాన్ని సాధిస్తే, సాక్షిత్వము వల్ల పురుషుడు సాధిస్తాడు. పురుషుడిలో సహజలక్షణము సాక్షిత్వము.
ఇప్పుడు ఇద్దరిలోనూ వైక్లబ్యము వచ్చేసింది.
మనసెప్పుడూ విషయాల చుట్టూ పరుగెడుతూ వుంటే, మనం ఏదైనా అధ్యయనం చేస్తే, దానిమీద బుర్ర పనిచేస్తుందా?
(ఎక్కువ సేపు వుండదు)
ప్రయోజనమేమి వుంది?
కాసేపు వుంటే అర్థమయ్యేవి కావుగా?
ఇప్పుడు మనం ఒక అంశాన్నే, ఎంత సేపటి నుంచి అధ్యయనం చేస్తున్నాము?
రెండు అక్షరాల శబ్దాన్ని తీసుకున్నాము ఇవాళ.
క్షమఅన్న అంశాన్ని. దాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి.
అనేక గ్రంథాలలో దానికి సంబంధించినటువంటి, లక్షణాలను ఎలా చెప్పారు?
ఆయా మహనీయుడు దానిని ఎట్లా జీవించాడు?
ఆ జీవితాన్ని నా జీవితంలోకి ఎట్లా తెచ్చుకోవాలి?
అప్పుడు కదా నేను సాధుపురుషుడిని అయ్యేది! అంతేనా? కాదా?
ఆ జీవించిక పోతే, సాధుత్వం ఎట్లా వస్తుంది? మనకి? వస్తుందా?
కథలు చదివితేనే వచ్చేసేటట్లు అయితే చిన్నప్పటి నుంచి బోల్లెడు చదివాం కదా! రాలేదుగా!
కాబట్టి జీవితంలో అవకాశం ఎప్పుడు వచ్చింది?
నిజజీవితంలో జీవిస్తూ, ఆయా లక్షణాలు మన జీవితంలో ప్రతిబింబించినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు, వాడిని క్షమించగలిగేటటువంటి ఉదారమైన స్వభావము వుండాలి. ఉదాత్తమైన స్వభావము వుండాలి. ఉదాసీనంగా వుండే సాక్షిత్వము ఏర్పడుతుంది అప్పుడు. ఒక్క క్షమ చూడండి, మనలో ఎన్ని లక్షణాలను తెచ్చిందో ఇప్పుడు. ఉదార స్వభావం తెచ్చింది, ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెచ్చింది. ఉదాసీనమైనటువంటి సాక్షిత్వాన్ని తెచ్చింది.
మరి అది (క్షమ) అవసరం కాదా?
క్షమ సర్వస్వమై పరగు అఖిల దైవీ గుణంబులకెల్ల
అన్నీ ఎన్నన్నా చెప్పనివ్వండి శాస్త్రం దైవీగుణాలు, ఆ దైవీ గుణాలు అన్నింటికీ కూడా, క్షమయే.
ఎందుకు గురువుగారు దైవంతో సమానమండి?
                                   (క్షమ వల్ల) ఆఁ... అది. తల్లికి ఎట్లా క్షమాగుణం వుంటుందో, గురువుకు కూడా, రాశీభూతమైనటువంటి క్షమాగుణం అది. శిష్యుడు ఎన్ని తప్పులైనా చెయ్యని, ఎన్నిసార్లన్నా వాడు తప్పుగా రాయని, ఎన్ని సార్లైనా తప్పు పలకని, ఎన్నిసార్లైనా తప్పుగా చేయని ఏం చేస్తూ వుంటాడు?
                                   అపారమైన కరుణా స్వభావి. అర్థమైందా అండీ! దాని వల్ల ఆయనకి ఎదో ఒరుగుతుందని ఆయనేం చేయడు. ఇక్కడ తల్లైనా ఇంకేమయినా అపేక్ష కలిగి చేయవచ్చేమో గానీ, గురువుకి అపేక్షా శూన్యం. వాడికి అపేక్ష లేదు. అపేక్ష వున్నవాడు గురువుగా పనికి రాడు. ఇది గుర్తు పెట్టుకోండి. బోధించే వాళ్ళు అందరు, మీలో ఏమూల అయినా సరే, ఏ కోశంలో అయినా సరే, అపేక్ష కనుక మిగిలి వుందంటే, మీరు ఆ సద్గురు స్ఫూర్తిని అందుకోలేరు. అపేక్షా శూన్యంగా వుండాలన్నమాట గురువు ఎప్పుడూ కూడా! అప్పుడు మాత్రమే నువ్వు ఆ స్ఫూర్తిలో నిలబడగలుగుతావు. అప్పుడు మాత్రమే నీలో నుంచి ఆ గురు సత్తా ధారా ప్రవాహంగా పనిచేస్తుంది. నీకు గనుక అపేక్ష గనుక వుందంటే, అది అట్లా అడ్డు వచ్చేస్తుంది. నువ్వు ఆ సద్గురు స్థితిలో వుండలేవు. ఆ సత్తా నీనుంచి ప్రవహింపచేయలేవు. ఎట్లా అయితే ఒక విద్యుద్వాహకం పని చేయాలి అంటే, ఏ అడ్డంకులూ లేకుండా విద్యుత్‌ ప్రసారం జరగాలో, ఇది కూడా అంతే. ఆ విశ్వ చైతన్య ప్రసారం, నీ వ్యష్టి చైతన్యం ద్వారా బహిర్గతం అవ్వాలి. వ్యక్తిగా వ్యక్తం అవ్వాలి. అలాంటి మురళి వలె అవ్వాలి. అందుకే సాధకుడికి ఎప్పుడూ మురళి’ (పిల్లన గ్రోవి) ఆదర్శం. తొమ్మిది రంధ్రాలు వుంటాయి దానికి కూడా. పైనుంచి కిందకి అంతా బోలు. గొట్టాం. ఏమి అడ్డం వుండదు. అప్పుడే ఇటుపక్క ఊదింది ఆ చివరికి మురళీ నాదంగా వ్యక్తమౌతుంది. అట్లాగే  ఆ అనంత విశ్వ చైతన్యాన్ని, ఈ తొమ్మిది తొర్రల బుర్రలోనుంచి వ్యక్తం చేయాలి. ఈ దేహమే మురళి. అది ఖాళీగా వుంటేనే, అపేక్షా శూన్యంగా వుంటేనే, శ్రీ కృష్ణ పరమాత్మ చేతిలో పనిముట్టుగా పనిచేసేది అది.
ఆయన ఆ మురళిని ఉపయోగించే, అందరిని సమ్మోహనం చేశాడు. ఆ మురళీ గానం వల్లనే సమస్త జీవులు, ఆయన వశం అయిపోయినాయి.
మరి అట్లా పనిముట్టుగా వున్నామా మనం?
అట్లా వున్నప్పుడు మనం ఏమై వున్నాము?
ఆయనకి మనకి భేదం ఎక్కడుంది?
అభేద స్థితికి దగ్గరగా వున్నట్లుగా లేదా?
కృష్ణుడు దేనినైనా విడిచిపెట్టాడు కానీ, చక్రాయుధాన్ని, ఆయన విష్ణుమూర్తిగా వున్నప్పుడు ధరించిన ఆయుధాలని కూడా వదిలేశాడు.
శ్రీకృష్ణుని అవతారంలో వున్నంత కాలం దేనిని పక్కన పెట్టుకున్నాడు?   
(మురళి - పిల్లనగ్రోవినే)
కాబట్టి పరమాత్మకు అతి దగ్గర కావాలంటే మనం ఏ సాధనను స్వీకరించాలి? ఇప్పుడు.
ఆ విశ్వ చైతన్యం నా నుంచి పూర్ణంగా వ్యక్తమయ్యేటటువంటి స్థితిలో నేను జీవిస్తున్నానా?
నా చేష్ట, నా కనురెప్పల కదలికలు సైతం ఆ చైతన్య కేంద్రాలుగా వుండాలి. సద్గురు మూర్తి యొక్క కృపా కటాక్ష వీక్షణం, వారి యొక్క దర్శనం పుణ్యం, స్పర్శనం పాప నాశనం అంటున్నామా? లేదా? ఎలా?
అవి ఎలా చేయగలుగుతాయి?
                                   అంటే ఆయన ఇలా వున్నాడు కాబట్టి. ఆ అనంత విశ్వ చైతన్యము, ఆయన యందు మూర్తీ భవించి, ఆయన యొక్క నవద్వారముల ద్వారా అవి బహిర్గతం అవుతున్నాయి. అవి వ్యక్తమౌతున్నాయి. ఆ విశ్వ చైతన్య ప్రభావం చేత, ఎవరెవరైతే దాంట్లోకి లోబడ్డారో, ఆశ్రయించారో, వాళ్ళల్లో అంతా అది పరిణామాన్ని తీసుకు వచ్చేస్తుంది. ఒక్కసారి ఆయన అలా చూశారండి. నేను మారిపోయానండిఅన్నవాళ్ళు కోకొల్లలు వున్నారు. మహానుభావుల యొక్క దర్శనానికి వెళ్ళి, ఆయన అలా నఖశిఖపర్యంతము ఒకసారి చూశారండి అంతే. అంతటితో నేను మారిపోయాను. అంతటి మహానుభావులు, సద్గురువులు అంటే.

మరి వాళ్ళు ఎటువంటి వారు?
ఎంతటి క్షమత కలిగినటువంటి వారు?
ఎటువంటి synchronisation వుంది వారికీను, విశ్వచైతన్యాన్నికి?
                                   వారు కూడా మనలాంటి, ఈ సప్త ధాతువులతో కూడిన దేహాన్నే కదా ధరించింది. మరి అలాంటి మహానుభావులు ఎంతోమంది ఈ భారతదేశంలో వున్నారు.

మనం ఇప్పుడు వారిని ఆశ్రయించి ఏ రకమైన జీవితాన్ని గడుపుతున్నాము?
ప్రతిరోజు మనం గాఢ నిద్రావస్థలోకి వెళ్లేలోపల, ఈ మూడు అవస్థలలో, ఈ రోజులో నేను ఈ విశ్వ చైతన్యానికి ఏ రకంగా నేను ట్యూన్‌ అయ్యాను?
దానిని ఏ రకంగా నేను ఆహ్వానించాను నాలోకి?
దానిని ఆహ్వానిస్తే ఏమైయ్యాను?
నేను అదే అయ్యాను. అర్థమైందా అండి!
నేను వెళ్ళి అందులో పడాలి అంటే, అది ఎక్కడుందో ఎట్లా తెలుస్తుంది?
ముందు దానిని ఏం చెయ్యాలి?
ఆహ్వానించాలి.
దానిని ఆహ్వానిస్తే?
ఏనుగు వచ్చి గుడారంలో దూరింది అప్పుడేమయ్యింది?
(గుడారం మొత్తం ఏనుగయ్యింది) అయిపోయే!
అది సులభం కదా!
గుడారం ఏనుగును వెతుక్కుంటూ వెళ్ళింది. ఎప్పటికి అవుతుంది ఇది? అవుతుందా?
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము?
గుడారము ఏనుగును వెతుకుతుంది.
కాశీలో విశ్వేశ్వరుడున్నాడా? రామేశ్వరంలో వున్నాడా... కృష్ణాలయంలో వున్నాడా?
అమ్మవారిలో వుందా? అయ్యవారిలో వుందా?
రామేశ్వరం వెళ్దామా? వివేకానందుడి దగ్గరకు వెళ్దామా?
పరమహంస మార్గంలో వెళ్దామా? అరవిందుడి మార్గంలో వెళ్దామా?
సత్యసాయి మార్గంలోనా...
ఏదీ వద్దు, ఒక నమస్కారం పెట్టి తిని పడుకుందామా?
ఇట్లా గుడారం ఏనుగును వెతుకుందన్నమాట. దీని వల్ల ప్రయోజనం లేదు. అవునా కాదా?
ఎందుకని ఈ పద్మనాభం అన్నటువంటి పదాన్ని అక్కడ వేశారయ్యా అని అంటే,
పద్మములు కుసుమ కోమలమైనటువంటివి. అవునా కాదా?
వాటి యొక్క లక్షణం ఏమిటి?
(ముట్టుకుంటే మాసిపోతాయి) “లలితం” ముట్టుకుంటే పడిపోవడం కాదు.
అదే గ్రామ్యభాష పనికి రాదు.
లలితం. ఎందుకని లలితం?
చాలామంది లలిత అన్న పేరు పెట్టుకున్నవాళ్ళను చూడండి, చాలా సాత్విక స్వభావులై వుంటారండి.
అప్పుడప్పుడు Reverse కూడా వుండవచ్చు. అది వేరే విషయం.
లలితం - ఆ లలితం అన్న లక్షణం సత్వగుణాధిక్యం.
మనిషి ఎప్పుడూ కూడా, ఈ లలితం అనే లక్షణాన్ని పోషించుకోవాలి.
సాధ్యమైనంతవరకూ నీలో విషయ ప్రకోపంరాగానే చాలా వరకూ పోయేది ఈ లాలిత్యం అండి. అవునా కాదా?
ఒక్క రోజు (వయసున్న) పిల్లవాడిని పెంచాలి అంటే, ఎలా పెంచాలండి?
One day age ఎలా పెంచాలండీ?
లాగీ, పీకి, పక్కకు పడేసి, ఏయ్‌ పాలుతాగవేంటి అని ఒక్కటిచ్చి?
కుదరదు కదా! ఎలా Deal చేయాలండి ఇప్పుడు?
లలితం. అంతేనా? కాదా?
కాబట్టి, జీవన ధర్మాలలో, మొదటి నుంచి చివరి వరకూ, నీ జీవకకు ఆధారభూతమైనది లలితంఅన్నమాట.

ఆ లలిత అన్న శబ్దమే ఆదిశక్తి స్వరూపము.

ఈ లలిత అన్న శబ్దమేమిటి?
ఆవెడ భువనేశ్వరీ పీఠానికి గుర్తు అన్నమాట. అక్కడే బిందుత్రయం పుట్టింది.
అక్కడే మండల త్రయం కూడా పుట్టింది. అది పద్మనాభం అంటే. అంతేగాని, తామర పువ్వు, తామర పువ్వులో మధ్యలో వున్న దుద్దు, అనే పోలిక ప్రతీకాత్మకం. అంటే ఉపమానంతో చెప్పినదన్నమాట.
కానీ అసలు వాస్తవానికి ఏం చెబుతున్నారు?
అంతకు ముందు ఏం చెప్పారు?
శాంతాకారం, భుజగ శయనం, పద్మనాభం... దివ్యత్వం ఉత్పన్నమైనది.
ఆ దివ్యత్వం ఏమైందట ఇప్పుడు?
బిందుత్రయముగా, మండల త్రయముగా మార్పుచెందుతుంది.
సృష్టి ఆరంభ స్థితిని బోధిస్తున్నారన్నమాట, ఆ పద్మనాభ స్థితిలో.
ప్రతీకాత్మకం కూడా ఏం చెప్పారు?
విష్ణువు నాభిలోనుంచి ఇలా తామర పువ్వు వచ్చింది, ఆ తామర పువ్వు ఇలా ఇలా వుంది, దాని మీద బ్రహ్మగారు కూర్చొని వున్నారు. ఆ బ్రహ్మగారు సృష్టి చేశారు. అంతేనా? నిజానికి ఇలా వుందా?
అలా లేదు. ఎక్కడినుంచి అయితే, సోమ సూర్య అగ్ని మండలములు ఉత్పన్నమైనాయో...
సోమ సూర్య అగ్ని మండలములు అంటే?
చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఈ మూడు మండలాలు ఉత్పన్నమైనాయి.
ఈ మూడు మండలాలు ఎక్కడ ఉత్పన్నమైనాయి?
శుక్ల, రక్త, ఇంకోకటి ఏమిటి? బిందు త్రయంలో...
మీకు ఆ బోధ లేదు, శుక్ల బిందువు, రక్త బిందువు, సంయుక్త బిందువు అని మూడు ఏర్పడ్డాయి. అర్థమైందా అండి?
ఈ మూడు బిందు త్రయము, మండల త్రయము ఈ రెండూ ఏర్పడిన స్థానం పేరు పద్మనాభి. ఆ పద్మనాభి. దానిపేరు.

మనలో ఒక పద్మం వుంది. ఏ పద్మమయ్యా అంటే?
                                   సహస్రార దళ కమలము అవతల అష్టదళ పద్మము వుంది, దానినే భూమా కేంద్రముఅని కూడా అంటారు. ఆ అష్టదళ పద్మస్థానమే పద్మనాభి.
                                   అదే హృదయ నాభి. అదే మండల త్రయస్థానం. అదే బిందు త్రయ స్థానం. అక్కడ నుంచి సృష్టి ఆరంభమైంది అని చెప్పడం కోసమని, నిజానికి ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం కూడా అదే చెప్తున్నది. ఎలా చెప్పింది అంటే?
                                   Whited Warf అనేటటువంటి star వుంటుంది. ప్రతీ విశ్వానికి కూడా ఒక Galaxy కి, ఒక black star, death అయితే నేమో black star, death కాకపోతే white dwarf, whited giant (వైటడ్‌జైంట్‌) అనేక పేర్లతో పిలుస్తున్నాము. అంటే ప్రకాశాన్ని అది వెదజల్లుతూ వుంటుందన్నమాట. ఆ ప్రకాశము వెదజల్లేదే, బిందువులై, నక్షత్రాలుగా మారిపోయినాయి. బిందువులై సౌరమండలాలు అయినాయి. బిందువులై చంద్రమండలాలు అయినాయి. బిందువులై కోటాను కోట్ల విశ్వంగా వ్యాపించింది.
మళ్ళా అదంతా వెనక్కి తీసుకుంటే?
(Black Hole) బ్లాక్‌హోల్‌ అవుతుంది. కృష్ణబిలం అవుతుంది. అర్థమైందా అండీ!
ఇలా విశ్వ ఆవిర్భావ, తిరోధానములను బోధించేటటువంటి శ్లోకమే ఆ శాంతకారం...శ్లోకం.
ఇప్పుడు మన వాళ్ళు విజ్ఞానాన్ని బోధించలేదా? అంతరిక్ష విజ్ఞానాన్ని?
శ్లోకం రూపంలో ప్రతీకాత్మకంగా బోధించారు.
కానీ మనకు ఎట్లా ఆనందం అనిపిస్తుంది?
ఇట్లా చెబితే ఆనందంగా అనిపిస్తుందా?
                                   విష్ణమూర్తి ఒక పాము మీద పడుకున్నాడు. ఆయన నుంచి ఇట్లా కమలం వచ్చింది. అక్కడ చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారి నుంచి, ఆయననుంచి సంకల్ప సృష్టి అంతా వచ్చింది. ఆయనకి వచ్చిందంతా విష్ణుమూర్తిగారు పోషించాడు. మళ్ళా కాసేపు ఆగిన తరువాత బ్రహ్మగారికి, విష్ణువుగారికి పోటీ పెట్టా్ం. అంటే మనుషుల మధ్య ఏ రకమైన పాత్రోచిత కల్పితాలు వున్నాయో, దీనినే దివ్యత్వానికి కూడా apply చేసి, సగుణ సాకార పద్ధతిలో, నామ రూపాల పద్ధతిలో, ఆవేశకావేశాలు మనకు ఎట్లా వున్నాయో, వాళ్ళుకు కూడా అవే ముడివేసి చెప్తే తప్ప ఆనంద పడే లక్షణం లేదన్నమాట.
ఇది ఎటువంటి లక్షణం ఇది?
చిన్న పిల్లలు ఐదేళ్ల పిల్లలకి, ఆ పంచతంత్ర కథలు ఎలా చెప్పారు?
అంటే, రాజ్య పరిపాలన ఎలా చెయ్యాలి అని బోధించ దలచుకున్నాడు, ఆ రాజ కుమారులకి. రాజ్య పరిపాలన ఎట్లా చెయ్యాలో, ఎట్లా చెప్తాడండి మరిప్పుడు?
                                   జంతువులు ఉదాహరణగా తీసుకుని, అడవి జంతువులు ఉదాహరణగా తీసుకుని అలా వేటకు తీసుకువెళ్ళి అలా అడవికి తీసుకువెళ్ళి, జంతువులను చూపెట్టి, ఆ జంతువుల యొక్క ప్రతీకాత్మకంగా ఇదిగో ఈ జంతువు వీడితో ఇట్లా మాట్లాడింది. ఈ జంతువు వీడిని ఇట్లా మోసం చేసింది, ఈ జంతువు వీడితో ఇట్లా యుద్ధం చేసింది. ఇట్లా జంతువులను అడ్డం పెట్టుకుని చెప్పినటువంటి కథలు పంచతంత్ర కథలు. మరి ఇప్పుడు ఏమి బోధించాడంటే ఆయన, రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాలని ఉత్తీర్ణులను చేయడానికి ఇది వాడాడు. మనవాళ్ళు కూడా పౌరాణిక కథల్ని, ఆ విజ్ఞాన శాస్త్ర భాండాగారాన్ని అందించే ఉద్దేశ్యముతో పౌరాణిక కల్పనగా చెప్పారు.
ఎవరికి చెప్పారు?
(చిన్న పిల్లలకి) ఎనిమిదేళ్ళ లోపల వున్న పిల్లలకి చెప్పారు.
                                   కానీ, మనకు వచ్చిన బుద్ధి వికాసము కూడా 80 ఏళ్ళు వచ్చినా 8 ఏళ్ళ దగ్గరే వుండడం వల్ల, మనం ఆ పౌరాణిక కల్పనలలోనుంచి, విజ్ఞాన భాండాగారాన్ని వెతికి పట్టలేకపోతున్నాము. ఎవరైతే మథిస్తారో దీనిని ఇట్లా, మనలోపల ఇట్లా మథనం జరగాలి. ఒకటి చదివాము, ఈ చదివినది ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? అని మనలో తిరగుతూ వుంటే ఏమౌతుంది?
ఒక దశకు వచ్చేసేటప్పటికి నువ్వు, ఆ మథనే జీవితం అయిపోతుంది.
అప్పుడు ఏమైపోతావు?
                                   నీకు ఆ క్షీరసాధన మథనానికి భేదం లేదు. ఇదే క్షీర సాగర మథనం అంటే. నీలోపల వున్న దైవీ లక్షణాలు, నీలోపల వున్న ఆసురీ లక్షణాల మధ్య యుద్ధం జరిగింది. ఆ మథనం జరిగింది. అప్పుడు ఏవి గెలిచినాయి?
దివ్యత్వము ఆవిర్భవిస్తుంది నీలో అప్పుడు. అలా అనుభూతం అవ్వాలి మనలో.
ఇలా అనుభూతం అయ్యింది నువ్వు మరచిపో చూద్దాము?
కష్టపడి సంపాదించావా లేదా? ఇప్పుడు?
వచ్చే వరకూ విడవకుండా పట్టుదలతో సంపాదించావా లేదా ఇప్పుడు?
సాధన చేశావా లేదా?
ఇప్పుడు అందరూ ఏమంటున్నారు?
సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నానండి. ఏం మార్పు రాలేదండి.
ప్రయోజనం ఏమన్నా వుందా?
అసలు క్షీర సాగర మథనం ఎన్ని సంవత్సరాలు జరిగిందండి?
తెలుసా మీకు ఎవరికైనా?
పురాణం చదివారా? బ్రహ్మాండ పురాణం చదివారా?
సహస్ర దివ్య సంవత్సరాలపాటు మథించారు.
సహస్ర దివ్య సంవత్సరాలు అంటే ఎంత?
దైవీ సంవత్సరాలు అంటే ఎంత?
మనకు సంవత్సరం ఆయనకు (బ్రహ్మ)కు ఏంటి?
ఒక పగలు. మళ్ళా ఒక రాత్రి అంటే ఇంకొక సంవత్సరం.
అట్లా ఎన్ని రోజులు అవ్వాలి?
అట్లా 365 రోజులు అవ్వాలి. ఆయనకు సంవత్సరం అవ్వాలి అంటే.
ఆయనకు సంవత్సరం అవ్వాలి అంటే ఎంత అవ్వాలి?
మన 365 ఒక పగలు అండి. మన సంవత్సరం ఆయనకు ఒక పగలు. మన సంవత్సరం ఇంకో సంవత్సరం రాత్రి. అర్థమైందా అండీ! ఇట్లా ఏమవ్వాలి?
అట్లా మళ్ళా 365 అవ్వాలి ఆయనకి. అంటే ఎంత అవ్వాలి?
(365 x 2 వేస్తే ఒకరోజు) x 365 వేయాలి. ఇది ఒక దివ్య సంవత్సరం.
                                   ఇటువంటి దివ్యసంవత్సరాలు, వెయ్యి సంవత్సరాలు మథించారు. సృష్టి వ్యక్తం కావడానికి అంత కష్టపడ్డారు. అది ఏదో, ఇవాల తలచుకుంటే, రేపొద్దున కల్లా ఉద్భవించలేదు. ఆ వచ్చిన విధానాన్ని explain చేయడమే ఆ సృష్టి ఎలా వచ్చిందని చెప్పడము. అదేమీ మనం అధ్యయనం చేయమన్నమాట. ఇవేమి కూడా. ఏదో వాళ్ళు ఏదో రాసుకున్నారులే. మనకు ఎందుకు అనవసరమైన గోల?
                                   దాని గురించి ఆలోచించడం, ఊరికే బుర్ర బ్రద్ధలు కొట్టుకోవడం, తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకు మనం అని, మన ఫీలింగ్‌ అన్నమాట.
                                   కాబట్టి మనం ఏదైతే బాగా అధ్యయనం చేసి, మనం దానిని జీర్ణింప చేసుకుని, ఆ సాధనగా దానిని దర్శించి, దర్శించాలి అంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి.
ఏం కావాలి మీకు, దర్శించాలి అంటే?
ఆ విశ్వ చైతన్యానికి, ఈ వ్యష్టి చైతన్యం, అదీ ఇదీ ఒకే సూత్రం మీదకు రావాలి. అవునా కాదా?
-*-
మనలో వున్న ప్రాణ మనో బుద్ధులు ఒక సూత్రం మీద పని చేస్తున్నాయా?
త్రికరణములు ఒక సూత్రం మీద పని చేయాలా వద్దా? ఇప్పుడు?
(చెయ్యాలి) ఇది ఒక సూత్రం మీద పని చేస్తే, ఈ సూత్రాన్ని పట్టుకెళ్ళి దానికి తగిలించ వచ్చు. అంతేనా కాదా?
మనం దగ్గర ఆ సూత్రం వుందా? ఇప్పుడు.
(లేదండి) ఇది ముందు ఒకే సూత్రం మీద వున్నాయో, లేవో చూసుకోవాలన్నమాట.
ఒకే సూత్రం మీద వున్నాయో, లేవో చూడాలి అంటే ఎట్లాగు? ఎట్లా చూస్తారు?
ప్రాణ మనో బుద్ధులుఒకే సూత్రంపై వున్నాయి అని ఎలా తెలుసుకుంటారు?
ఒకే తీరుగా వున్నాయా? విడివిడిగా వున్నాయా?
(ఇప్పుడు విడివిడిగా వున్నాయండి)
ఎలా చెప్పగలరు?
(ఆలోచిస్తున్నాం కాబట్టి)
(జ్ఞాపకం ఏర్పడితే...  ప్రాణ మనో బుద్ధులు separate గా వుంటే జ్ఞాపకాలు ఏర్పడుతాయండి, జ్ఞాపకాలు ఏర్పడడం లేదూ అంటే కనుక)
అదిగో ఆయన ఏదో చెబుతున్నాడు. అది ఒక కొలమానం.

                                   అంటే ప్రాణ మనో బుద్ధులు విడివిడిగా పనిచేసినప్పుడు, బలమైన జ్ఞాపకాలు ఏర్పడుతాయి, వట్టి జ్ఞాపకాలు కావు అవి. విషయవాసనా బలంతో కూడినటువంటి, సంగత్వ దోషంతో కూడినటువంటి జ్ఞాపకాలు ఏర్పడుతాయి. అంటే అర్థం ఏమిటి?
                                   మనలో కొన్ని పనులు చెయ్యొద్దు, చెయ్యొద్దు అని అనిపిస్తూ వుంటుంది. కానీ చేస్తూ వుంటాము. అవునా కాదా? ఎవరికివాళ్ళు ఆలోచించుకోండి. నేను అన్నీ లక్షణాలే చెబుతాను. ఎవరికి వాళ్ళు apply చేసుకోవడం మీ పాత్ర. Apply చేసుకుని సందేహాలు వస్తే మీరు వ్యక్తిగతంగా నాతో మాట్లాడి నివృత్తి చేసుకోవడం కూడా మీ బాధ్యతే. మాట్లాడక పోతే నేను చేయగలిగినది ఏమీ లేదు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి?

                                   అసలు సంగత్వ దోషం ఎక్కడ ఏర్పడుతుందంటే, ఈ మూడు విడివిడిగా పనిచేయడంలోనే, విషయ సంగత్వం ఏర్పడుతుందన్నమాట. ఆ సంగత్వ దోషం వలనే జీవుడు ఏర్పడుతున్నాడు. ఏమిటయ్యా దీనికి గుర్తు అంటే, మనలోపల ఇది చెయొద్దు, ఇది అధర్మం, ఇది పనికి రాదు, ఇది మంచిది కాదు అని మనకు తెలుసు. అర్థమైందా అండి.
కానీ, బలవత్తరమై చేస్తాం.
ఏం చేస్తాం అండీ? బలహీనం, ఏం చేస్తాం?
                                   పట్టుకోలేక పోయాము, ఇంద్రియ నిగ్రహము లేదు. అని చేస్తాము అన్నమాట. అదొక భాగం. కొన్ని compulsory గా ఇవి మంచి పనులు, చేసి తీరాలి, సాధించాలి, అని కూడా తెలుసు. కానీ అవి చెయ్యము.

మన బుద్ధికి రెండు లక్షణాలు వున్నాయి. ఏమిటి?
                                   చేయకూడదు.చేయకూడదు.చేయకూడదు.చేయకూడదు. అని తెలుసు. కానీ బలవత్తరమై చేస్తాము. అదొక భాగము.

రెండవ పద్ధతి ఏమిటి?
                                   చెయ్యాల్సినవి కూడా తెలుసు మనకి, పొందాల్సినవి కూడా తెలుసు. ఏవి సాధించాలో కూడా తెలుసు. కానీ (అవి చెయ్యము) బుద్ధివల్ల కాదనమాట అవి. అట్లా చేయడానికి ఒప్పుకోదు అది. అహా! అది కష్టం, నేను చేయను అంటుంది.
పిల్లాడిని చూడండి. ఎక్కాలు కిందనుంచి పైకి చదవమంటే ఏమంటాడు?
(నాకు కుదరదు అంటాడు) కిందనుంచి పైకి చదవడం, మా టీచర్‌ ఒప్పుకోదు అసలు, నేను పైనుంచే కిందకి చదువుతా. అవునా కాదా?
ఒరేయ్‌! కిందనుంచి పైకి నేర్చుకోరా! నీకు తెలివి తేటలు పెరుగుతాయి అని చెబితే, వాడు ఏమంటాడు?
అసలు ఎక్కాలు ఎందుకు? ఒకటో క్లాస్‌ తరువాత ఎక్కాలు ఎవడూ అడగడు. అంటే ఎప్పటికప్పుడు ఏం జరుగుతోంది ఇప్పుడు?
ఆఁ... Easy way of living. Easy going nature అంటాము దీనినే. మామూలుగా చెబితే, కప్పదాటు పద్ధతి.
సాధ్యమైనంత వరకూ ఎలా తప్పించుకుందాము?
ఎక్కడ తప్పించుకుంటావు?
ప్రసవ వేదనలో తప్పించుకున్నావా? మరణ వేదనలో తప్పించుకుంటావా?
సృష్టి ధర్మంలో తప్పించుకోవడం అన్న business లేదు. (No escape button in life)
దాట వేయడం కూడా అస్సలు లేదు. ఎందుకని?
అవి రెండు తమో గుణ ధర్మాలు.
అవి సాధ్యపడవు. తాత్కాలికమైనటువంటి ఉపశాంతిని కలుగజేసినట్లు కనబడుతాయి కానీ, శాశ్వతమైన సమస్యను తీసుకువచ్చి ఎదురుగుండా పెడుతాయి. అప్పుడేమి చేస్తావు?
అప్పుడు బోన్‌ లో పడుతావు. అర్థమైందా అండీ!

ఏవైతే మనం జీవితంలో, దాట వేస్తూ వచ్చామో, అవన్నీ ఏమౌతాయి?  
                                   ఎక్కడికీ పోవు, నీలోనే నిక్షిప్తం అయివుంటాయి. ఒక బలహీన క్షణంలో అవే నీ ఎదురుగుండా వచ్చి కూర్చుంటాయి. అన్నీ ఒకేసారి పరిష్కరించాలి అప్పుడు. ఇప్పుడు ఒక్కొక్కటీ పరిష్కరించవలసింది పోయి, ఆ సమయం కూడి వచ్చేసినప్పుడు ఏమౌతాయి?
అన్నీ ఒకసారి వచ్చేస్తాయి.
చాలా మంది ఏమంటారు?
అన్ని సమస్యలు ఒక్కసారే వచ్చేసినాయండి అంటారు.
ఎక్కడినుంచి వచ్చాయేమిటి అవి?
ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డాయా?
ఏమీ ఊడిపడలేదు.
మనమే ఏం చేశాము వాటిల్ని?
(Post pone) దాట వేశామన్నమాట వాటిని. తగినట్టుగా మారలేదు. తగిన సాధనను పెంచుకోలేదు. తగిన కష్టం చేయడానికి ఒప్పుకోలేదు. తగినటువంటి వికాసాన్ని పొందలేదు. తగిన అధ్యయనం చేయలేదు. తగిన గురువుని వెతక లేదు. తగిన ఆశ్రయాన్ని పొందలేదు. తగినటువంటి ఏకీకృతమైన సమన్వయ విధానాన్ని క్షమతని సంపాదించలేదు.
తద్వారా ఏమైంది?
ఒక సందర్భం వచ్చేసేటప్పటికి, అన్నీ ఎదురుగుండా వచ్చేసినాయి.
ఏం చేయమంటారండీ, ఏం చేయమంటారండి?
ఏం చేస్తావు అప్పుడు నువ్వు?
అప్పుడు బోన్‌ లో చిక్కకున్నట్టు చిక్కకుంటావు.
Way out లేదు అంటావు. 
అప్పుడు ఏం చేయమన్నారు?
ఒక్కటే way out అప్పుడు. ఉదాసీనంగా వుండగలగడమే.
ఎందుకనిట?
ఆ ఉదాసీనం సాక్షిత్వ లక్షణం.
                                  
                                   “సాక్షిగా వున్న వాడిని ఈ భూప్రపంచంలో ఏదీ ఏమీ చేయజాలదు. వాడిని ఏదీ, ఈ మూడు అవస్థలుకాదు కదా, మరణం కూడా వాడిని ఏమీ చేయలేదు.”

                                   అటువంటి సాక్షిత్వం అనెడి రాజౌషధాన్ని వాడితే తప్ప, దాంట్లోనుంచి బయటకు రాలేవు.
అది వాడితే?
(వస్తాం బయటికి)
దాని రిపర్కషన్స్‌ వుండవా?
రాజ ఔషధం వేశామండి. అప్పుడు శరీర ప్రాణ మనో బుద్ధులు వేదన పొందవా?
పొందుతాయి.
తీవ్రమైన ఔషధాలు వాడితే ఏమౌతుంది?
తీవ్రమైన జబ్బువచ్చిందండి. తీవ్రమైనటువంటి ఔషధాలు వాడాలా వద్దా?
వాడకపోతే ఎట్లా మరి బాగుపడుతావు?
వాడితే ఏమౌతుంది?
(Side effects వుంటాయి)
అది Side Effect లేకపోతే actual గా నీలో వికాసాన్ని పూర్తి చేయడమా?
నీలో వికాసాన్ని పూర్తి చేయడం.
Transformation complete అవ్వాలి ఎప్పటికైనా.
నువ్వు అప్పుడే ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకొస్తే, transformation easy అయిపోయేది.
ఎప్పుడైతే అలా అవ్వలేదు నువ్వు. ఏమౌతుంది?
రాజ ఔషధాలు వాడక తప్పదు.
వాడితే ఏమౌతుంది?

                                   తగినటువంటి వికాసం అంతా ఆ సమయంలో ఒకే క్షణంలో పొందవలసి రావచ్చు, ఒక సంవత్సరంలో పొందవలసి రావచ్చు, ఒక జీవితకాలంలో పొందవలసి రావచ్చు. కొంతమందికి జీవిత కాలం కష్టం వుంటుంది. నన్నడిగితే అలాంటి వాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఎవ్వరూ లేరు. అలాంటి వాళ్ళు నాకు తెలుసు. అనుదినము సమస్యలు వున్నటువంటి వాళ్ళు. ప్రతిక్షణము సమస్య వున్నటువంటి వాళ్ళు. దానికి out లేదు, way out లేదు. ఉదాసీనంగా వుండడం తప్ప. వేరే way out లేనే లేదన్నమాట. ఆ ఉదాసీన లక్షణాలను నేర్పడానికి సంవత్సరాలు పడుతుంది. అది నేర్చుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. అది ఎప్పుడు నేర్చుకోగలుగుతావంటే, ఈ మూడు ఏకసూత్రం మీద వుంటేనే వీలౌతుంది. లేకపోతే వీలుకాదు.

(ఏక సూత్రం మీదకు తేవడం ఎట్లా అండీ?)
                                   శరీర ప్రాణ మనో బుద్ధులు నాలుగూ కూడా ఏక సూత్రం మీద వుండాలి. ఉంటేనే ఉదాసీనుడవై వుంటావు. వుంటేనే సాక్షిగా వుంటావు. ఈ నాల్గిటిలో ఏ ఒక్కటి పక్కకు తప్పుకున్నా, మళ్ళా అది ఆ బోన్ లో చిక్కుకుంటుంది. మళ్ళా దానిచేత బాధించ బడుతుంది. మళ్ళీ సంస్కారం ఏర్పడుతుంది. మళ్ళా వాసనాబలం ఏర్పడుతుంది. అట్లా ఇలా జన్మ పరంపర పుడుతూ పోతూ, పుడుతూ పోతూ, వస్తూ పోతూ, వస్తూ పోతూ వుంటుంది. కాబట్టి ఈ జన్మలో తల్లి గర్భాన్ని ఆశ్రయించాను. తల్లిపాలు తాగవలసిన అవసరం ఏర్పడింది. దాని చేత పోషించబడలవలసినటువంటి సందర్భం వచ్చింది. ఇక మరల మరుజన్మలో అటువంటి సందర్భం రాకుండా చేసుకోగలిగేటటువంటి జీవన విధానాన్ని నేను ఆశ్రయించాలి అన్నవాడే, ముముక్షువు.

                                   అటువంటి మోక్షేచ్ఛ, తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ కలగాలి అంటే, ప్రాథమిక మైనటువంటి plat form ఏమిటి?
                                   ఈ నాలుగూ ఏక సూత్రం మీద వుండాలి. ఆ క్షమతని సంపాదించాలి. ఎంత కష్టపడైనా సంపాదించాలి. చెడిపోవడానికి ఒక్క జన్మచాలు. ఈ ఏకసూత్రంగా వున్నది చెడగొట్టుకోవడానికి, ఒక జన్మచాలు. గట్టిగా మాట్లాడితే ఒక సంవత్సరం కూడా చాలు. చెడిపోయిన దాన్ని బాగుచేయాలంటే మళ్ళా 101 జన్మలు పడుతుంది అంటాడు వశిష్టుడు యోగ వాశిష్టంలో. ఈ త్రికరణ శుద్ధిని గనుక ఎవరైతే కోరి చెడగొట్టుకునే వాళ్ళందరూ ఎక్కువ మంది వున్నచోట కలియుగం. కలియుగం అంటే వేరే ఏమీ లేదు. ఎంత ఎక్కవ జనాభా కోరి, ఈ త్రికరణ శుద్ధిని మానవులు... అంటే మానవుడు సహజంగా త్రికరణ శుద్ధితో పుట్టాడు. ఈ మానవ ఉపాధిలో సహజంగా వుంది అది.
కానీ, మనం ఏం చేశాము?

                                   “విషయ సంగత్వ దోషం చేత, ఆ ఆకర్షణ బలం చేత, ఈ ఏకసూత్రమై వున్నటువంటి శరీర ప్రాణ మనో బుద్ధులు పక్కకు పోయినాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, విషయ సంగత్వంలో ప్రియ, అప్రియాలు రెండు వున్నాయి. ఒక్క ప్రియమే కాదు, అప్రియము కూడా వున్నది”.
నాకు ఇది నచ్చదండి. కఠువుగా చెప్తావు.
ఏం లలితంగా చెప్పలేవా ఆ మాట?
(చెప్పవచ్చు కానీ చెప్పము)
ఎందుకని?
(స్వభావం అది)
గుణ ధర్మం. అంతేనా కాదా? వేరే ఇంకేమైనా వుందా?
అట్లా ఎప్పుడైతే నువ్వు, ఆ ప్రియ అప్రియాలకు ఎప్పుడైతే నువ్వు సంగత్వ దోషానికి లోనయ్యావో, ఏమౌతావు?
ఈ ఏక సూత్రం కాస్తా...
మీరందరూ ధ్యానం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, కలలు గానీ, ఇతరత్రా etc. లుగానీ, ఎక్కడినుంచి ఉత్పన్నం అవుతున్నాయి?
(శరీర ప్రాణ మనో బుద్ధులు ఏక సూత్రం మీద లేక పోవడం వలన)

                                   సూత్రబద్ధం కానటువంటి మనో బుద్ధుల యొక్క వ్యవహార శైలిని, గాఢ నిద్రావస్థలో నువ్వు మునగాలి అంటే, అది సూత్ర బద్ధం అయితేనే మునుగుతుంది. లేకపోతే మునగదు. నువ్వు గాఢ నిద్రావస్థలో పడిపోయే ముందు, ఈ శరీర ప్రాణ మనో బుద్ధులన్నీ, ఆ కలల రూపంలో వ్యవహరించి, అనుభూతమై, అక్కడ నువ్వు పొందవలసినటువంటి ప్రియ అప్రియాలను పొంది, మళ్ళా సూత్రబద్ధం అయిపోతుంది. అప్పుడు మునిగిపోతావు. సుషుప్త్యావస్థలో. అర్థమైందా అండీ?

అందువల్లే నీకు సుషుప్త్యావస్థ సుఖంగావుంది.
మొన్న ఎవరో నన్ను ప్రశ్న అడిగారు.
అక్కడ సుషుప్త్యావస్థలో వుంటే ఇక్కడ మెలకువలో ఎలా వుంటామండి అని?
ఇప్పుడు ఆ సుషుప్త్యావస్థలో ఎలా వున్నావు?
ఈ నాలుగు (శరీర ప్రాణ మనో బుద్ధులు) ఏకసూత్రమై వున్నాయి.
కాబట్టే సర్వజీవులు సుషుప్త్యావస్థలో ఆనందమయ కోశంలో వున్నాయి.
సహజంగా ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. ఏ అసహజత్వము లేదు అక్కడ.
జ్ఞాతగా సహజంగా ఆనందమయకోశంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
అదే ఏక సూత్రబద్ధం మెలకువలో చేస్తే?
(ఎలా అండీ?)
అసలు నీకు ముందు ఆ లక్ష్యం పొందాలనే బలం (కాంక్ష) వుంటే అదే వస్తుంది.
పలక, బలపం పట్టుకుని అక్షరాలు నేర్చుకోవాలండి.
ఎలా ఎలా అంటే వస్తుందా?
ఏం చెయ్యాలి?
(దిద్దాలి)
                                   పలక, బలపం దగ్గర పెట్టుకుని, ఒక గురువును వెతుక్కుని, వాడి దగ్గర వుండి, వాడు చెయ్యి పట్టుకుని దిద్దిస్తే, ఆ దిద్దే వంకరలు అన్నీ, వస్తాయి.  A, B, C, D లలో అన్ని వంకర్లు వుండవు. మన అకారము నుంచి క్షకారము వరకు వున్న వంకర్లు.
అవునా కాదా?
ఎందుకు అలా పెట్టారు?
వాళ్ళ లాగా ఫ్రీగా రాయవచ్చు కదా!
(శబ్దానికి ఒక shape వస్తుందనీ...)
కష్టపడకుండా నేర్చుకున్న విద్య, సరియైన కాలంలో అక్కరకు రాదు.
(కర్ణుడి శస్త్రాస్త్ర విద్యలాగానా అండి)
అర్థమైందా అండి? అవన్నీ మన కోసం సృష్టించబడిన పాత్రలు అవి.
అర్థమైందా అండి!
కాబట్టి కష్టపడి నేర్చుకున్న విద్య?
(ఎప్పటికీ గుర్తు వుంటుంది) మీ సొంతం అది.
అర్థమైందా అండీ!
అయాచితంగా వచ్చింది, అప్పుడేమి చేస్తావు?
దానికి విలువ తెలియదుగా నీకు. ఎక్కడో పారేసుకుంటావు. అర్థమైందా అండీ?
కోహినూర్‌ డైమండ్‌ని paper wait గా వాడుకుంటావు.
ఎందుకని?
విలువ తెలియదుగా.
                                   కాబట్టి అందరు ఈ శరీర ప్రాణ మనో బుద్ధులు అనే ఈ సూత్ర వ్యవస్థని, సక్రమమైనటువంటి పద్ధతిలో మీరు క్షమత’...
ఇది క్షమతఅంటే అసలు. నిజానికి క్షమత అంటే అర్థం ఇది. అర్థమైందా అండీ!

                                   అంటే ఎప్పుడూ ఒకే లక్ష్యం మీద పని చెయ్యాలి. ఎప్పుడూ ఒకే తీరుగా వుండాలి. పక్కకు పోకూడదు ఇది. ఆ సంగత్వ దోషంలోకి పోకూడదు. ఎక్కడ వుండమంటే అక్కడ వుండాలి అది. ఎక్కడ పని చేయమంటే అక్కడే పనిచేయాలి. అంతేనా కదా?

                                   అలా కట్టివేసేటటువంటి సాధనలు చేయాలన్నమాట. ఏక సూత్రమయ్యేటటువంటి పద్ధతిగా చెయ్యాలి ధ్యానం. ధ్యానం అంటే అర్థం అదే. ధ్యానం అంటే ఏదో కాదు. ఆకాశం అవతల ఆలోచించడానికి ఏమీ లేదు. ఈ నాల్గింటిని ఒకే లైన్‌లో వుంచగలగడమే ధ్యానం. ఇది ధ్యానానికి సరియైనటువంటి సూత్రం. ఎవరైతే ఇలా వుంచారో, ఇప్పుడు నీ చేతిలో ఒక అస్త్రం సిద్ధంగా వుంది. ఈ నాలుగూ కూడా ఏ రూపాన్ని పొందినాయి? ఇవి ఇలా వుండడం వల్ల. ఒక సాధనంగా మారినాయి, ఒక పనిముట్టుగా మారినాయి, ఒక అస్త్రంగా మారినాయి, ఈ అస్త్రానికి మంత్ర శక్తిని జోడిస్తే దివ్యత్వాన్ని పొందుతుంది.

త్రిపురాసుర సంహారం చెయ్యాలి అని అంటే, ఆయన అస్త్రాన్ని ప్రయోగించాడా లేదా?
ఏమిటది? ఎవరు ఆ త్రిపురాసురులు?
                                   మనమే. మూడు అవస్థలలో, వాళ్ళు సూర్యుడికి అడ్డం వచ్చేవాళ్ళు. సూర్యగమనానికి అడ్డం వచ్చిన వాళ్ళు త్రిసురులు. త్రిపురాసురులు. ఇద్దరు వున్నారు. * వీళ్ళందరూ పాపం ఆ ప్రాతీకాత్మక బోధ మనకు అర్థం అవుతుందని అలా చెప్పారు. మనకేమో ఆ తెలివి లేదు. అది అర్థం కావడం లేదు. ఆ మెలకువా, కల, నిద్రలలో ఈ సూత్ర బద్ధత చెడిపోతుంది అని అర్థం. అవే త్రిపురాలు అంటే. వేరే ఇంకేమీ లేదు. ఈ మెలకువ కల నిద్రలలో ఈ సూత్ర బద్ధత చెడిపోకుండా కనుక మనం నిలబెట్టుకోగలిగినట్లయితే,
ఏమైంది అప్పుడు?
                                   “ఆ సుషుప్త్యావస్థలో ఏ ఆనందమయ కోశ పరిధిలో ఆనందాన్ని పరిమితంగా, జ్ఞాతను తెలుసుకోవడానికి అవకాశం లేకుండా, చైతన్యం పొందడమనే ఎఱుకను తెలుసుకోవడానికి అవకాశం లేకుండా, వాటిని అనుభవస్తున్నావో, అదే చైతన్యస్ఫూర్తిని మెలకువలో ఎఱుకతో అనుభవిస్తావు”. ఇది దీని ప్రయోజనము. అర్థమైందా అండీ!

                                   ఈ మూడు అవస్థలు అనేటటువంటి త్రిపురాసుర సంహారము గనుక జరిగినట్లయితే, ఈ త్రిపుటిని గనుక కలిపేసినట్లయితే, సంహారం అంటే తల తరగడం కాదు, మూడింటిని ఏకం చేయడం అని అర్థం. హారము, సంహారము. ఎక్కడి నుంచి మొదలయ్యిందో అక్కడికి తీసుకువచ్చి కలపడం అని అర్థం.

కాబట్టి మనకి ప్రాథమికంగా మన లక్షణము ఏమిటి?
ఆనంద లక్షణము. నువ్వు ఆనంద స్వరూపుడివి.
ఈ ఆనంద లక్షణాన్ని ఎప్పుడు అనుభవిస్తున్నావు?
                                   కేవల సుషుప్త్యావస్థలో, ఎఱుక లేకుండా అనుభవిస్తున్నావు. దాన్ని సాక్షిత్వంతో మూడు అవస్థలలోనూ అనుభవించే స్థితికి కనుక నీవు తేగలిగితే,
అప్పుడు నీవు ఎవరివి?
నీవే శివుడవు. అది శివ స్వరూపము అంటే అర్థం.
అప్పుడు నీ స్వరూపం ఏమిటి?
ఆనందమే నీ స్వరూపం.
క్రమేపీ ఆనంద లక్షణం నుంచి సచ్చిదానంద లక్షణానికి ఎదుగుతావు. ఎందుకని?
ఆనందమయ కోశ పరిధిలోనుంచి బయటకు వచ్చేశావు కాబట్టి. అర్థమైందా అండీ?!
                                   “ఎవరికైతే ఇవి ఆ ఏక సూత్రంగా పనిచేయలేదో, ఎవరికైతే విషయవాసనా బలం చేత అవి పక్కకు పోతూ వున్నాయో, ఏవైతే కూడదు కూడదు అన్నా కూడా అది ఇచ్ఛగిస్తుందో, పొందాలి, పొందాలి అని చెప్పినా పొందకుంటుందో, ఈ వైకల్యమైనటువంటి బుద్ధిని, ఎవరైతే స్వాధీనపరచుకో గలుగుతున్నారో, వాడికి ఇంద్రియ నిగ్రహము వున్నట్లు”.
                                   “ఎవరికైతే ఈ ప్రపంచం మీద ఇటువంటి, రాగద్వేషములు లేనటువంటి భావనలు కలిగినాయో, వాడు వైరాగ్య సంపన్నుడు”.

                                   ప్రియాప్రియములు లేవు వాడికి. కేవల సాక్షిత్వమే. వాడికి ఇంకేమీ కనపడదు. పాత్రలు కనపడవు. పాత్రోచితములు కనపడవు. ధర్మాధర్మములు కనపడవు. సర్వద్వంద్వములు వైరాగ్యమనే అగ్నిలో దగ్ధం అయిపోయినాయి వాడికి. వాడికి కేవల సాక్షిత్వం తప్ప, కేవల శివస్వరూపం తప్ప, అన్యం కనబడదు వాడికి.

                                   అందుకే జీవన్ముక్తులు కొందరు లలితంగాను, కొందరు కఠిన స్వరూపులుగాను, కొందరు కఠినాతి కఠిన స్వరూపులుగాను, కొందరు కోపస్వభావులు గాను, కొందరు దయా స్వభావులుగాను ఆయా జీవన్ముక్తిని పొందిన స్థితిని బట్టి, వాళ్ళు అలా వుంటారు. వాళ్ళు ఇలాగే వుండాలని నియమము లేదు. దుర్వాసుడుకూడా జీవన్ముక్తుడే. పరిపూర్ణ జ్ఞాని ఆయన.

మరి దూర్వాసుడిని మనం అందరం దేనికి వాడుకుంటాం ఉపమానంగా?
(ముక్కోపిగా)
                                   ముక్కోపి అంటారు మీరు. నేను ఏమంటాను అంటే ఆయన పరిపూర్ణజ్ఞాని. జన్మరాహిత్యం పొందినటువంటి మహానుభావుడు దుర్వాసుడు.

                                   మరి ఆ మహానుభావుడిని, భౌతిక జీవనంలో మనం దేనికి ఉపమానంగా వాడుతున్నాము?

ఎట్లా అయితే సముద్రంవల్ల నీకేమిటయ్యా ప్రయోజనం అంటే?
మజ్జిగలో ఉప్పు కలుపుకోవడానికి ఉప్పు పనికొచ్చిందండి అన్నట్లుగా వుంది.

ఎందుకని?
భౌతికం చేత మనం సంతృప్తి చెందుతున్నాము. ఎక్కడో దోషం లేదు?
                                   అనంతమైనటువంటి విశ్వ చైతన్య స్థితిని దాటినటువంటి మహానుభావులు వాళ్ళంతా కూడా. విశ్వమే లేదన్న స్థితిలో వున్నటువంటి వాళ్ళు వాళ్ళు, మనం విశ్వచైతన్యానికి దారి వేసుకోవడానికే మన వల్ల కావడం లేదు. ఎక్కడో తేడా లేదు? అర్థమైందా అండి?

                                   కాబట్టి మన భారతదేశంలో వున్నటువంటి విజ్ఞాన సంపదని, మనదేశంలో వున్నటువంటి సనాతన ధర్మాన్ని, నిజజీవితంలోకి ఆకళింపు చేసుకోవాలి. ముందు మనలో లక్ష్యం బలంగా స్థిరపడాలి. “నేను ఏమైనా సరే వీటిని ఏకసూత్రం చేయాలి”. ఈ ఏకసూత్రం చేయడానికి ఏదైనా అడ్డురానివ్వండి, అది నాకు అవసరం లేదు, అని త్యజించగలిగేటటువంటి సమర్ధత రావాలి.

                                    ఆ ఇంద్రియ నిగ్రహం, ఆ వైరాగ్య బలం ఏనాడైతే నీకు ఉత్పన్నమైందో, ఆ రెండు రెక్కల చేత, ఏం చెప్పాడండీ?
నీకు జ్ఞానం కావాలంటే ఏం చెప్పారు?
అభ్యాస, వైరాగ్యముల చేతనే జ్ఞానం లభిస్తుందని,
భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడా? లేదా?
కర్మయోగంలోనే చెప్పాడు అది కూడా. ఎందుకని?

                                   నువ్వు కర్మ చేసేటప్పుడు నేను కర్త, నేను కర్త, నేను కర్త అంటావు. అనంగానే అది పక్కకు పోతుంది. నాహం కర్త, నాహం కర్త, హరిః కర్త. ఈశ్వరుడే కర్త. అనే నిష్కామ కర్మ లక్షణాన్ని పూనకపోతే, నీవు ఇది ఏక సూత్రబద్ధము ఎలా చేస్తావు?
కాబట్టి మనలో ఎంత బలీయంగా వుండాలయ్యా అంటే, అయ్యో! ఈ ఒక్కరోజూ పోయిందే, ఈ ఏకసూత్రం చేయడానికి ఒక్కరోజు గడిచిపోయింది.

ఇంకా ఎన్ని రోజులు వుంటావో, ఎన్ని క్షణాలు వుంటావో నీకు తెలుసా?
తెలియదు కదా!
                                   కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ఈ సమన్వయ స్థితిని సాధించాలి. ఈ క్షమతని సాధించాలి. ఈ క్షమ అన్న లక్షణమే, మానవ జీవితానికి ఎంతో మూలకేంద్రమై యున్నది. అటువంటి దానిని మీరు అందరూ కూడా ఎంత తొందరగా సాధిస్తే, సాధన... ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,

                                    “సాధన బహిరంగం కాదు, సాధన ఆంతరికం, జీవన్ముక్తి అన్నది ఆంతరికము, బహిరంగం కాదు, నీ లోపల వుండాలి ఆ అనుభూతం, ఆ ముక్తావస్థ, ఆ స్వేచ్ఛ, రెప్పపాటులో ఆ పైన (స్థితిలో) వుండకలిగే సమర్థుడవై వుండాలి”.

రెప్పపాటులో ఎందుకని?
                                   మరణం రెప్పపాటుకంటే తక్కువ కాలంలో వచ్చే అవకాశం వుంది. అర్థమైందా అండి! ఆ మరణం, ఆ మృత్యువు వచ్చి ఆవహించే లోపలే నువ్వు అవతల వుండగలగాలి. అంత సమర్థుడవై వుండాలి. వాడు మృత్యువును జయించినవాడు. (మృత్యుంజయుడు) మరి అప్పుడు శివస్వరూపుడివేగా. అట్లా నిన్ను ప్రోత్సహిస్తుంది వేదాంతము. అట్లా నిన్ను ప్రోత్సహిస్తుంది తత్త్వజ్ఞానము.

ఇప్పుడు ఏమి వదిలి పారిపొమ్మని?
ఏమీ వదిలి పారిపోమనలేదు.
ఎక్కడికి పోతావు?
                                   ఎక్కడికి పోయినా, నువ్వు నీ సంసారం నీతో పాటే వస్తాయి. నువ్వు అడవికి పోయినా, అమెరికాకు పోయినా. మనిషివి పోయావంటే, నీ శరీర ప్రాణ మనో బుద్ధులు నీతో పాటే వచ్చినాయి కదా!
కాబట్టి సంసారం అంటే ఎక్కడుంది?
                                   నువ్వే, నీ సంసారానికి ఆలవాలం నువ్వే, ఆశ్రయం నువ్వే, నీ జనన మరణాలకు ఆశ్రయం నువ్వే, నీ సుఖదుఃఖాలకు ఆశ్రయం నువ్వే, నీ ప్రియఅప్రియాలకు ఆశ్రయం నువ్వే. నీలో వున్న గుణధర్మాలే అలా ప్రతిబింబిస్తున్నాయి. ఈ సత్యాన్ని గ్రహించి వెనక్కు తీసుకుని, ఆ వెనక్కు తీసుకోవడం రావాలి.
తాబేలుని ఉపమానంగా ఎందుకు చెబుతున్నారు?
ఏదైనా తేడా రాగానే, అలా దేనిని తీసుకోవాలి ఇప్పుడు?
బుద్ధిని.
ఎందుకని?
అది ఇంద్రియాలలో కెల్లా రాజు.
                                   ఆ బుద్ధిని ఏక సూత్ర బద్ధంలోకి వెనక్కు తీసుకోవడం వచ్చిన వాడు, ఏం చేస్తాడు అప్పుడు?
                                   స్వాధీనం అయిపోయినాయి అన్నీ, అలా వుండు అంటే, అలా వుంటది అంతే. ఇలా పో అంటే, పోతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళు అక్కడికి, ఆ విషయాన్ని తెలుసుకో అంటే, ఇక్కడుండే తెలుసుకుంటుంది.
ఎక్కడో గురువు వున్నవాడు, ఎక్కడో వున్న శిష్యుడికి ఎలా సహాయం చేస్తాడు?
వాళ్ళ ఇద్దరి మధ్యా connection ఏమిటి?
అలా సహాయం పొందిన వారు లేరా?
వున్నారు.
అలా జ్ఞానం పొందిన వారు లేరా?
(ఏక లవ్యుడు)
ఎలా పొందారు మరి?
విశ్వ చైతన్యమే.
వాళ్ళిద్దకి మధ్యా వారధి ఎవరు?
(విశ్వ చైతన్యం) wireless.
ఈనాడు మాట్లాడుతున్నటువంటి Wi-Fi వాళ్ళకు భూమండలం అంతా వుంది వాళ్ళకి.
మన Wi-Fi కాసేపే. ఇక్కడితోనే. అవతలికి వెళ్తే కనపడదు అది మళ్ళా.
ఈనాడు మాట్లాడుతున్నటువంటి internet వ్యవస్థ వాళ్ళకు ఆనాడే వుంది.
ఎక్కడో పిలిస్తే ఎక్కడో పలుకుతాడు. వాడు అక్కడ లేడు కదా! మరి?
ఇప్పుడు వాళ్ళ శరీర, ప్రాణ, మనో, బుద్ధులు ఎటువంటి ఎలక్ట్రానిక్‌ టవర్స్‌ అవి?
ఎంతటి కెపాసిటీ వుంది వాటికి?
                                   భూమండలం మీద ఎవరు పిలిచినా పలుకగలిగేటటువంటి, కెపాసిటీ వున్నటువంటి ఎలక్ట్రానిక్‌ టవర్స్‌ అవి. మరి ఈ ఇవేగా. మనలో లేవా? ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, నూట్రాన్‌లు? అణువులు లేవా? ఆటమ్‌ లేదా? మాలిక్యూల్స్‌ లేవా?

ఎందుకని మనం వాటిని ఐయనైజ్‌ చేయలేకపోయాము?
ఎందుకు మనం వాటిని ప్రిపేర్‌ చేయలేకపోతున్నాము?
ఆ ప్రిపేర్‌ చేయడం జపం.
ఆ ఐయోనైజ్‌ చేయడం ధ్యానం.
                                   ఆ ఐయోనైజేషన్‌ని ఎక్సప్లోర్‌ అయ్యేటట్లు చేయడం, విశ్వచైతన్యంతో అనుబంధ పడేటట్లు చేయడం యోగం.
                                   ఆ అనుసంధాన ప్రక్రియ యోగం. Preparative ప్రక్రియ జపం, తపం, ధ్యానం. తపింప జేయాలి నువ్వు అట్లా.

వాటిని విషయాలవైపు పోనిస్తూవుంటే, ఇంకా తపస్సు ఎక్కడ వుంటుంది?
లడ్డూ తిందామా? జాంగ్రీ తిందామా?
ఇంకా ప్రయోజనం ఏమి వుంది?
                                   ఇట్లా అన్ని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఆ బుద్ధి అనేటటువంటి ఇంద్రియం చేతనే పనిచేస్తున్నాయి.

కానీ ఎనుగుని మావటివాడు ఎట్లా లొంగదీసుకున్నాడు? అంతేనా, కాదా?
దానికి ఎక్కడ బలహీనమో తెలుసుకుని, అక్కడ కొట్టాడు.
ఒక్కసారే కొట్టాడు. ఇంకోసారి కొట్టడు ఇక.

కింద నిలబడి అంకుశాన్ని చూపెట్టాడు. చూపెట్టగానే దానికి ఏం గుర్తొచ్చింది?
ఆ తీవ్రమైన తలపోటు గుర్తొచ్చింది. ఆ తీవ్రమైన తలపోటు గుర్తుకువచ్చి కూర్చోమంటే కూర్చుంది, లేవమంటే లేచింది.
                                   ఏనుగుని లొంగదీసుకున్నటువంటి మావటివాని వలే నీవు నీ బుద్ధి అలాగ లొంగదీసుకో. దాని బలహీనత ఎక్కడ వుందో తెలుసుకో! అక్కడ కొట్టవయ్యా దానిని దెబ్బ. ఒక్కసారి దానిని ఎదురించు.

                                   “ఒక్కసారి దానిని (బుద్ధిని) స్వాధీనపరచుకో! అది నీ చెప్పుచేతల్లోకి వస్తే, ఎంత స్వేచ్ఛవుందో అప్పుడు నీకు తెలుస్తుంది. దాని చెప్పుచేతల్లో నువ్వు వున్నావు కాబట్టి, నీకు ఇప్పుడు ఆ స్వేచ్ఛ యొక్క విలువ తెలియడం లేదు”.

                                   పైగా అది ఎట్లా ఆడమన్నప్పుడల్లా ఆడి, తగాదాలు కొని తెచ్చుకుని, సమస్యలు పెంచుకుని, వైరుధ్యాలు పెంచుకుని, ప్రియాప్రియములకు లొంగి, ద్వంద్వాలకు లొంగి, సకల జీవరాశులతో ఋణానుబంధాన్ని బాగా పెంచుకుని, ఈ జన్మలో అత్తగారో, మరుజన్మలో మొగుడో, లేకపోతే మరు జన్మలో అబ్బాయో, మనలో వున్న రాగద్వేషాలే ఆయా పాత్రోచితమైన జీవులు అవుతున్నాయి.

ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అంతా?
ఏం వీళ్ళతోనే ఎందుకు కలసి జీవించ వలసి వచ్చింది?
                                   వాళ్ళు అందరూ ఈశ్వర ప్రతినిధులు. నువ్వు ఎక్కడ దారి తప్పావో చూపెట్టేటు వంటి దీపపు సమ్మెలు. వారందరూ కూడా guide post లు. ఇది విజయవాడు పోతుంది, ఇది హైదరాబాద్‌ పోతుంది. Guide post వుంటేనే మనకు తెలిసేది. అట్లాగే

                                   “(ఆ ఈశ్వర ప్రతినిధులు) నువ్వు ఈ త్రికరణ శుద్ధి నుంచి, ఆ సాక్షిత్వము నుంచి, ఆ పొందవలసిన జ్ఞానం నుంచి, ఆ తీవ్ర మోక్షేచ్ఛ నుంచి, ఆ జీవన్ముక్తావస్థ అనే లక్ష్యం నుంచి ఎక్కడ పక్కకు తప్పుకు పోయావో, చెప్పేటటువంటి ఆ జీవులు వాళ్ళు’’. 
వాళ్ళు అందరూ Guide post లు.
వాడు ఎక్కడి నుంచి వచ్చాడు?
అమ్మ పంపిచింది.
ఈశ్వరుణ్ణి చూపెట్టే మార్గం అమ్మదే!
ప్రకృతి యొక్క కృప అంటే, గురు కృప అంటే ఏమిటి?
                                   ఆయా వ్యతిరేక లక్షణాలు వున్న జీవులతో నువ్వు కలిసేట్టుగా చేస్తారు. జీవించేట్టుగా చేస్తారు. వ్యతిరేక పరిస్థితులలో, దుర్భరమైనటువంటి స్థితులలో, నువ్వు ఉదాసీనంగా వుండి ఎలా ఎదుగుతావో చూస్తారు. ఆ ఉదాసీన లక్షణంతోటి నువ్వు సాక్షిత్వంలోకి ఎలా వస్తావో, సహాయం చేస్తారు. అది కదా నిజమైన సాధన. అది కదా నిజమైనటువంటి తత్త్వజ్ఞానము. అది కదా నిజమైనటువంటి సాంఖ్యవిచారణ

                                   ఆలోచించి చూడండి. పంచీకరణలు అంతా ఇక్కడ ఇలా కదా మనం వాడవలసినది. అందుకు కదా అసలు అంతసేపు, ఆ పంచీకరణను నేర్పడానికి వాళ్ళు ప్రయత్నం చేసింది. 600 పేజీల వివేకచూడామణి ఎన్నిసార్లు చిరిగిపోయేట్టు చదివినా కూడా దానిని నిజజీవితంలో apply చేయడం రాకపోతే? ప్రయోజనం వుందా?
ఇప్పుడు వివేకచూడామణి ఎన్నిసార్లు తిరగేసేసి వుంటారు?
తిరగ మరగ... నేను ఒక్కసారి కూడా చదువలేదు. అర్థమైందా అండీ?
                                   కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. “సారాంశాన్ని మనం గ్రహించాలి. అనుక్షణం దానికోసం వెంపర్లాడాలి. ఆ వెంపర్లాట రానంతవరకూ సాధన ముందుకు సాగదు. నిరంతరాయంగా నేను దీనిని ఎందుకు చేయలేను, నేను దీనినే చేస్తాను. ఆ పట్టుదల, ఆ సింహహృదయం మీలో రానంతవరకూ మీరు దానిని అధిగమించలేరు”.
ఎందుకని?
                                   అది భౌతికం కాదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. నీలోపలే వుంటుంది. నువ్వు ఎప్పుడు బలహీనంగా వున్నావో చూసి, మాటువేసి దెబ్బకొడుతుంది. అది వ్యాఘ్రరాజం. అది సింహం కాదు. పులి. మాటున  వుండి దెబ్బకొడుతుంది. నువ్వు ఎప్పుడు ఏమరపాటుగా వుంటావో అది చూస్తుంది, చూసి టక్‌ మని ముందుకి వచ్చేస్తుంది. ఇక అంతే, విలవిలలాడిపోతావు అంతే! అప్పటి వరకూ ఎన్ని పాఠాలు చెప్పినా దాని ముందు, (దిగదుడుపే) ఏమీ లాభం లేదు.
                                   తినద్దు,తినద్దు,తినద్దు,తినద్దు,తినద్దు, అంటూనే తినేస్తుంది. అయిపోయింది. గోవిందా. నారాయణా.
                                   మళ్ళా మొదలే కథ. మళ్ళా మన పోరాటం, మన వెంపర్లాట, మళ్ళా 104 జ్వరం వచ్చేదాకా పోరాడాల్సిందే. ఆ సమయం, సందర్భం, పరీక్షా సమయం వచ్చేంత వరకూ పోరాడాల్సిందే. మళ్ళా పరీక్షా సమయం వచ్చేటప్పటికి, మన పక్కనే అది పనిచేస్తుంది.
                                   ఇట్లా ఈ అభ్యాసాన్ని మనం గమనిస్తూ, సాక్షిగా వుండి గమనిస్తూ, ప్రయత్నం చేసే కొద్దీ మనలో ఏ బలం పెరిగింది? ఇప్పుడు.

                                   ‘క్షమతపెరిగిందన్నమాట. తద్వారా నువ్వు ఇదే మార్గంలో వస్తున్నావని నేను గ్రహించాను. ఆ గ్రహింపు శక్తి రాగానే ఏమైపోయింది ఇక. నీ విషయం నాకు అర్థమై పోయింది. ముందు నీవిక మేల్కొంటావు.
ముందు నువ్వు మేల్కోగానే ఏమైపోతావు?

                                   ఆ సంస్కార బలం, ఆ వాసనా బలం, ఆ విషయాలు, ఆ యొక్క ఆకర్షణా బలం అవన్నీ ప్రేరేపణ పొందుతూ వుండగానే నువ్వు ముందే మేల్కొని గ్రహిస్తావు.
                                   గ్రహించి ఆఁ.. ఇప్పుడు చేస్తా నా తపస్సు. నా సాధన. దీనికి ఇవతల. త్రాసులో ఇవతల పెడతాను. ఇవతలేమో ఇవి వుంటాయి. ఇవతల మన తపస్సు, మన సాధన, మన బలం, మన గురు కృప, మన ఆర్తి, మన వేడు కోలు, అన్నీ సమస్త శక్తులు వడ్డేస్తావు. అప్పుడు ఏమౌతుంది?

నీ ఓటు ఇటు పడంగానే, దాని బలం తగ్గిపోయింది.
నీ ఓటు ఇటు వైపు వుంటే, ఇది పైకి పోయింది. అర్థమైందా అండీ!
నీ ఓటుయే అక్కడ ప్రధానం. ఆఖరి ఓటు నీదే. ఏది ఎన్ని పెట్టినా?
ఇటే నువ్వు ఓటు వేశావు, అప్పుడు ఏమైపోయింది?
Finished. అలా ఒక్కసారి జయించు. జీవితంలో. ఇక నీ జోలికి రాదు అది ఇక.
ఎలా?
                                   ఏనుగు మావటి వానికి లొంగిన రీతి, బుద్ధి నీలో వున్నటువంటి బుద్ధి, అలా నీకు లొంగిపోతుంది.
అప్పుడు నీవు ఏం చేశావు?
                                   దానిని పదే పదే దానినేమీ దెబ్బతీయక్కరలేదు. ఇప్పుడు అంకుశాన్ని చూపెడుతే చాలు. ఇక అంతే.
                                   అమ్మో! మళ్ళా ఆ తలపోటు వచ్చేస్తుందిరా బాబు అని, ఒళ్ళు వంచి పనిచేస్తుంది అర్థమైందా?

పిల్లవాడిని ఒక్కసారి గట్టిగా శిక్షిస్తామా లేదా చిన్నప్పుడు?
                                   ఎందుకని? ఏదో మారాం చేసి, గట్టిగా ఏడుస్తాడు వాడు. అది అసందర్భమై వుంటుందన్నమాట. సందర్భోచితం కాదన్నమాట. అసందర్భం అన్నప్పుడు ఏం చేస్తాము?
గట్టిగా శిక్షిస్తాము.
ఎందుకని?
బలమైన జ్ఞాపకం ఏర్పడేటట్లుగా శిక్షిస్తాము.
ఈ సారి వాడికి ఏమౌతుంది?
                                   ఏయ్‌ అనంగానే, అమ్మో! అమ్మ కొడుతుంది. అనేటటువంటి దృక్పథం వాడిలో ఏర్పడుతుంది. తద్వారా ఆ రకమైన ప్రవర్తనలోకి వెళ్ళకుండా వుంటాడు. అక్కడ ఎలా చేశామో, ఇక్కడ లోపల మాత్రం ... అన్నీ బయట చేయగలుగుతున్నామండీ! వచ్చిన తగాదా అది. మన లోపల మనం చేయలేకపోతున్నాము.

                                   నిజానికి అంతర్ముఖ ప్రయాణం అంటే, విశ్వ చైతన్యంతో ఏకీ కృత అనుసంధానం పొందినటువంటి వ్యష్టి చైతన్యం, విశ్వ చైతన్యకేంద్రంలోకి ప్రయాణం చేసి, తనను తాను పోగొట్టుకొని, విశ్వచైతన్యమూలకేంద్రం వైపు ప్రయాణం చేసి, చైతన్య రహిత స్థితిని తెలుసుకోవడం అనే దాకా చేరుతుంది. అది అంతర్ముఖ ప్రయాణం అంటే”.

ఇప్పుడు మనం అంతర్ముఖ ప్రయాణంలో ఎన్ని అడుగులు వేశాము?
                                   ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలి. నాలోనున్న వ్యష్టి చైతన్యాన్ని విశ్వచైతన్యంతో ఏకీ కృత పరిచి, అనుసంధానపరిచి, సదా దానిని నుంచి స్ఫురణని, స్ఫూర్తిని పొందుతూ, దైవీ ప్రణాళిక ప్రకారము జీవిస్తూ, సద్గురు స్ఫూర్తి ప్రకారం జీవిస్తూ, మూడు అవస్థలలోనూ సాక్షిగా వుండి, ఆ యొక్క గమనాన్ని తెలుసుకొంటూ, ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని ఎక్కడిదాకా కొనసాగించాలి?

                                   ఈ వ్యష్టి చైతన్యం వెళ్ళి ఆ విశ్వ చైతన్యంతో కలిసిపోవాలి. సశరీరియై వుండగా, శరీరం వదిలేసినాక కాదు, సశరీరియై వుండగా, నీ హృదయంలో ఆ విశ్వచైతన్య కేంద్రం ఉత్పన్నం అవ్వాలి, మేల్కోవాలి. ఆ విశ్వ చైతన్య కేంద్ర స్థానం నుంచి, ఈ శరీరేంద్రియ ప్రాణమనస్సులని నడపాలి. ఆ విశ్వ చైతన్య కేంద్ర స్థానం ఎరిగిన వాడివై, అనంత విశ్వము చైతన్య రహిత స్థితిలో ఎలా వుందో, తెలుసుకునేటటువంటి దాకా నీ ప్రయాణం సాగాలి. ఇది అంతర్ముఖ ప్రయాణం అంటే, మరి ఈ అంతర్ముఖ ప్రయాణం అనే లక్ష్యంతో కదా, అసలు వేదాంతము బోధించబడుతుంది. దానికొరకు కదా సాంఖ్య తారక అమనస్క పద్ధతిని ప్రవేశపెట్టింది. సాంఖ్యము అంటే పంచీకరణలు, ఆ పృథక్కరించడం, ఐదు ఐదులు ఇరవైఐదుగా విడగొట్టడం ఎలాగో తెలుసుకోవడం సాంఖ్య విచారణ. దానిని నిజజీవితంలో ఇలా వినియోగించి, తారక స్థితిలోకి ఎదగాలి. తారకం అంటే ఎక్కడో వుందని అనుకునేరు,

ఈ వ్యష్టి చైతన్యాన్ని ఆ విశ్వచైతన్యంతో అనుసంధానపరచడమే తారకం అంటే”.

                                   తరించుట. ఈ భూమిక నుంచి ఆ భూమికకి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తరించుట. అదే యోగమంటే. ఈ తారకమే యోగం. అందుకే తారకయోగం అన్నారు దానిని. ఎవరైతే అనంతమైనటువంటి విశ్వచైతన్య కేంద్రంలో నిలబడి వుండి, దైవీ ప్రణాళికలో జీవిస్తూ, జీవన్ముక్తావస్థలో జీవిస్తూ, అనంత విశ్వచైతన్య రహిత స్థితిని ఎవరైతే తెలుసుకుంటున్నారో, వాళ్ళేమో మోక్షాన్ని పొందుతున్నారు. అర్థమైందా అండీ!

                                   జనన మరణ రాహిత్యన్ని పొందుతున్నారు. అలాంటి చిట్టచివరి గమ్యానికి చేరేటటువంటి మార్గాన్ని పొందడమే, ఆ చివర, ఆ చలన రహితమైనటువంటి స్థితి. ఆ బయలు అన్నటువంటి స్థితి. విశ్వమే లేనటువంటి బయలు అన్నటువంటి స్థితిలో నిలబడి, వుండగలగడం, సశరీరియై... బాగా గుర్తుపెట్టుకోండి, సశరీరియై... ఆ స్థితిని పొందగలగడం ఏదైతే వున్నదో అదేమో అమనస్క యోగమై వున్నది. అదేమో అమనస్క యోగం. ఈ అనుసంధాన పరిచే ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయడమేమో, తారక యోగం.
                                   అదే భౌతికంగా కనబడుతున్నటు వంటి ప్రపంచాన్ని, భౌతికంగా కనబడుతున్నటు వంటి ఈ పంచకోశాలని, నీకు నీకే పృథక్కరించి, ఐదైదుల ఇరవై ఐదు తత్వాలుగా, 25 ఈ యొక్క మేలు కలయికగా, దైవీశక్తి వల్ల ఇవి నడుపబడుతున్నాయి అనేటటువంటి పాదుని మీలో నెలకొల్పడానికి, బోధించబడుతున్నది అంతా కూడా, సాంఖ్యవిచారణ దృష్టి. ఇది సాంఖ్యయోగం.

కాబట్టి ఈ సాంఖ్య తారక అమనస్క పద్ధతిలో వున్నటువంటి ఏక సూత్రం ఏమిటి?
Balance. క్షమత.

పదార్థము, శక్తి.
చైతన్యము, సృష్టి. అర్థమైందా అండీ?

భౌతికంగా చూస్తే పదార్థము శక్తి.
అవతలికి వెళ్ళావు. అక్కడేమి వుంది?
చైతన్యము, సృష్టి. అర్థమైందా అండీ!

ఇంకా అవతలికి వెళ్ళావు. అక్కడ ఏమి వుంది?
ఆత్మ - పరమాత్మ. రెండే వున్నాయి అక్కడ, వేరే ఇంకేమీ లేవు ఇక.
ఇంకా అవతలికి వెళ్ళావు. ఇవేమీ లేవు.
                                   ఇలా అవతలికి దాటటం. ఇది వున్న స్థితినుంచి ఉన్నత స్థితికి దాటటం. ఎవరికి వాళ్ళు మిమ్మల్ని మీరు ఇట్లా గమనించుకోండి.

ఎంతవరకూ నేను విషయాతీతంగా వుండగలుగుతున్నాను?
ఎంతవరకూ నేను ఈ త్రికరణ శుద్ధిని సాధించాను?
ఎంతవరకూ నేను ఈ విశ్వచైతన్యాన్ని, ఆ విశ్వచైతన్యంతో అనుసంధాన పరచగలిగాను?
ఎంతవరకూ ఆ దైవీ శక్తిని, ఆ దైవీ చైతన్యాన్ని, ఆ ఈశ్వరీయమైన చైతన్యాన్ని నేను నాలో నింపుకోగలుగుతున్నాను?

                                   అన్ని ఆరాధనలలో, అన్ని భక్తి మార్గాలలో, అన్నింటిలో వున్న ఈ విశ్వ చైతన్యాన్ని, నీలోకి ఆవహింపచేసుకోవడమే, ఆహ్వానం పలకడమే, నీలో వున్న ప్రతి కణము, ప్రతి అణువు, ఆ విశ్వ చైతన్యంతో (ionize) ఐయనైజ్‌ అవ్వడం. ఆ విద్యుదీకరణం పొందడం, ఆ విద్యుదైస్కాంత తత్వ స్థితిని నువ్వు అనుభూతం పొందడం.

అప్పుడు ఏమయ్యావు?
                                   మనలోపల వున్నటువంటి, ఈ మెదడు అనేటటువంటి ఈ మెదడు పనిచేసేదంతా ఆ విద్యుదైస్కాంత తత్వం తోటే. కానీ ఇది పరిమితం. ఇంద్రియ పరిధిలో మాత్రమే పనిచేస్తుంది. కానీ ఇందులోనే ఒక లక్షణం వుంది. అది అనంత సృష్టికి కూడా అనుసంధాన పడగలుగుతుంది. కానీ దీనిని అట్లా మనం వాడడం లేదు. ఆ హృదయ కేంద్రాన్ని మేల్కొలపడం లేదు. ఆ విశ్వ చైతన్య కేంద్రాన్ని గుర్తించడం లేదు. ఆ ఘన సుషుప్తిలో నువ్వు ఎలా వున్నావో, ఈ మెలకువలో ఆ సాపేక్షంగా చూసుకుని వుండగలిగేటటువంటి, సాధనని చేయడం లేదు. జీవితకాలం అంతా సాంఖ్యయోగమే.

                                   జీవితకాలం అంతా ఇంట్లో వున్న వస్తువులని గోతంలో వేయడం, మూట కట్టడం, మళ్ళా వస్తువులన్నీ తీయడం, కింద పెట్టడం. నా దృష్టిలో సాంఖ్యయోగం అంటే ఇంతే. మీ ఇంట్లో వున్న వస్తువులన్నీ తెచ్చి గోతాంలో వేసి మూట కట్టేశాము. అంతేనా కాదా?
                                   ఇదిగో ఇది నువ్వు అన్నాము. నాకు అర్థం కాలేదండి అన్నావు. అయితే అన్నీ మళ్ళా తీసి ఒక్కొక్కటి కిందపెట్టమన్నావు. అన్నీ తీసి మళ్ళా నీ ఇల్లు అంతా పరిచాము. ఇది నువ్వు అన్నాము. అంతే. ఐదు ఐదుల ఇరవై ఐదు కలిసి నువ్వు అయ్యావు. నువ్వు ఎలా వున్నావో నీకు తెలియదు కాబట్టి, మళ్ళా ఐదు ఐదు ఇరవై ఐదు ముక్కలు తెగ్గొట్టి, విడగొట్టి చూపెట్టాము. ఏం ప్రయోజనం వచ్చింది?

ఈ తారక యోగము లేక తరించుట ఎట్లు? వట్టి మోక్షమును సాధించుట ఎట్లు?

                                   అమనస్కం సిద్ధించాలి అంటే, ఆ స్థితికి నువ్వు ఎదగాలి కదా! అందరం ఎదగడం, ఎదగడం అని సులభంగా వాడుతున్నారు ఈ మధ్యలో. ఈ ఎదగడం అంటే ఇది. ఈ ఎదుగుదల ఎక్కడి దాకా వచ్చింది? ప్రశ్నించుకోవాలా అక్కరలేదా?

                                   రోజూ... సంవత్సరానికి ఒకసారి వెళ్ళామండి, గురువుగారిని ఆశ్రయించామండి, పట్టుకున్నామండి, కాళ్ళా పడ్డామండీ, వేళ్ళా పడ్డామండీ లేదంటే కన్నీళ్ళు పెట్టుకున్నామండి. ప్రయోజనం ఏమివుంది? ఇవన్నీ నీక అవసరమే. నేనేమీ కాదు అనను. నీ పరిణామంలో అవన్నీ అవసరమే.

కానీ End Result ఎక్కడికి చేరాము? ఎక్కడికి తేలాము?

                                   ఈ సంవత్సర కాలం ముగిసిపోయింది, బ్రహ్మగారికి ఒక పగలు ముగిసిపోయింది. ఇంకో సంవత్సరం గడిచిపోయింది. బ్రహ్మగారికి ఒక రాత్రి గడిచిపోయింది. ఒక రోజు అయిపోయింది ఆయనకి. ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తాడో, ఎప్పుడు కళ్ళు మూస్తాడో, ఎప్పుడు ప్రళయం వస్తుందో, ఎప్పుడు జీవ ప్రళయం సంభవిస్తుందో మనకు తెలియదు.

మరి మన ఆయుర్దాయం ఎంత?
ఒక దివ్య సంవత్సరం వుంటుందా?
                                   మన మానవ సంవత్సరాలు శత ఆయుర్దాయమే, అందులో సగకాలాన్ని తీసేసి, సగ కాలం అవిద్యలో, సగకాలం అజ్ఞానంలో, సగకాలం నిద్రలో అన్నీ పోగా మిగిలిన జ్ఞాన కాలం ఎంత? సాధన కాలం ఎంత?

                                   కాబట్టి, ప్రత్యేకంగా అరగంటో, 20 నిమిషాలో, 10 నిమిషాలో రామకోటి వ్రాశానండీ లేకపోతే కాసేపు ఏదో, 10 నిమిషాలు ధ్యానం చేశానండీ, 10 నిమిషాలు మంత్రజపం చేశానండి, కాసేపటికి ఒక దీపారాధన ఇచ్చానండి, ఒక అరటిపండు నైవేద్యం పెట్టానండి, ఆ అరటిపండు కల్లా నాకు మోక్షం ఇచ్చేయాలండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి తదహం భక్త్యుపహృతం బధ్నామి ప్రియతాత్మనః నేనిప్పుడు భగవంతుడి ప్రియతముడినే కదండీ! కాబట్టి నాకు భగవంతుడికి భేదం లేదండి. ఒకసారి నారాయణ అనుకుంటే చాలు కదండీ! ఇలాంటి short cut methods పనికిరావు.

ఇవన్నీ ఎవరికి?
                                   ఎవరికైతే సాంఖ్య తారక అమనస్క యోగ విధికి పనికిరారో, సాధకులుగా పనికిరారో, సాధన చతుష్టయ సంపత్తి లేదో, వాళ్ళు a, b, c, d లు కూడా నేర్చుకోవడానికి అర్హులు కారో ... అర్థమైందా అండీ,

మూడేళ్ళ చిన్నపిల్లాడికి ఏం నేర్పుతాం? రెండున్నర ఏళ్ళ పిల్లాడు, ఏం నేర్పుతాం?
                                   ఆ వయసులో మనం ఎట్లా అయితే వాడికి మాటలు నేర్పుతున్నామో, సాధకులుగా అలా సంతృప్తి పడడం ఆ రెండున్నర సంవత్సరాల వయస్సుకు సంబంధించిన వికాసం లాంటిది. ఇంకా నేను పొద్దిన దీపం హారతి ఇచ్చానండి, సాయంత్రం కర్పూర హారతి ఇచ్చానండి, కార్తీక మాసంలో ఉసిరికాయ హారతి ఇచ్చానండి. లేకపోతే దోసకాయ హారతి ఇచ్చానండి, లేకపోతే ఉసిరి చెట్టుకు హారతి ఇచ్చానండి... అవన్నీ చెయ్యొద్దు అని కాదు.                                    చేయండి.
                                   చేస్తే నువ్వు ఏ వివేకంలో వున్నావో నీకు బోధ పడాలి. నీకు సంతృప్తి అక్కడే కలుగుతున్నప్పుడు, నీ బుద్ధి వికాస స్థాయి ఏ స్థాయిలో వుంది అంటే, 3 years.
                                   నీకు 30 ఏళ్ళ వచ్చినా, 300 ఏళ్ళు వచ్చినా, 3000 ఏళ్ళు వచ్చినా కూడా ఆ బుద్ధి వికాసానికి parameter ఎక్కడ పెట్టారు అప్పుడు?
నువ్వు సాంఖ్యయోగానికి పనికి రావు, అర్థమైందా అండీ!

సాంఖ్యయోగానికే పనికి రాని వాడు, ఎక్కడ పనికి వస్తాడు ఇక?
                                   కాబట్టి, జ్ఞానమార్గం అనేటటువంటిది కత్తి అంచు మీద నడవడం లాంటిది. దీనికి సిద్ధపడ్డవాళ్ళే, ఈ మార్గంలో నడువగలుగుతారు. ఇది అత్యంత కఠినమైనదే. అత్యంత... ఏమని చెప్పాలి అంటే, సరిగ్గా మాట్లాడాలి అంటే...

రెప్పపాటు క్షమత లోపించినా కూడా తల తెగిపోతుంది”.

కాళ్ళతో నడువవు ఇక్కడ, నడవడం అంటే అందరూ కాళ్ళతో అనుకుంటారు.
జ్ఞాన మార్గంలో కాళ్ళతో ఎట్లా నడుస్తావు?
బుద్ధితో నడుస్తావు, వివేకంతో నడుస్తావు.

                                   రెప్పపాటు ఏమరపాటుగా వుంటే, పెద్దపాము మళ్ళా వైకుంఠపాళిలో ఒకటికి వచ్చేస్తావు అంతే. ఈ రకంగా జ్ఞానమార్గం, ఎంత విశాలమైందో, ఎంత వివేకశీలమైందో, అందులో ఏమరపాటు లేకుండా, అప్రమత్తంగా నడవ వలసినటువంటిది. సాధకుడు కూడా అలానే వుండాలి. కాబట్టి నిరంతరాయంగా ప్రయత్నించాలి ముఖ్యంగా వాళ్ళు. సరే! ప్రతి క్షణము, ప్రతి శ్వాసకి ప్రయత్నం చేసే సమర్థుడై వుండాలి. నేను ఈ జన్మలోనే మోక్షం సాధించాలని మాటకి వాచా వేదాంతము చాలదు ఇక్కడ. నేను కాసేపు అది చదివానండి, కాసేపు ఇది చదివానండీ, ఈ తాత్కాలికమైనటువంటి ప్రయోజనం, తాత్కాలికమైనటువంటి ఉపశాంతికి సంబంధించినటువంటి paracetomal tablets పనికిరావు ఇక్కడ. అర్థమైందా అండీ!

అటో ఇటో తేల్చుకోవడానికి సిద్ధపడ్డవాడే, జ్ఞానమార్గావలంబీకుడు.

* ఇకపై ఒక నియమం చేద్దాము.
                                   నా క్లాసుకి కేవలం జ్ఞానమార్గావలంబీకులు మాత్రమే రండి. సిద్ధపడ్డవాళ్ళు రండి. మీరు మాట్లాడితేనే నేను మాట్లాడుతా. ఈ జనరల్‌ క్లాసులు లేవు. ఇప్పటికి చాలా సంవత్సరాలనుంచి నేను ఇట్లాగే మాట్లాడుతూ వచ్చా. దరిదాపు నాకు తెలిసి ఒక పుష్కర కాలం దాటి పొయ్యింది. ఇక నుంచి ఒక నియమం పెట్టుకుందాము.

                                   మీరందరూ మీమీ తరగతిలకు సంబంధించినటువంటి గురువును వెతుక్కోవాలన్నమాట. మీరు నా క్లాసుకి సరిపడా రావాలి అంటే, మీరందరూ జ్ఞానమార్గావలంబీకులై వుండి, అలాంటి అంతర్ముఖ ప్రయాణానికి సిద్ధపడ్డవాళ్ళు మాత్రమే రండి. నిర్మల గారు సత్సంగం అని, నా సత్సంగం అని పిలిస్తే, ఎందుకంటే నేను అలాగ పైకే మాట్లాడుతాను, కిందకి మాట్లాడడం నాకు రాదు.

ఎందుకంటే కిందకి మాట్లాడితే ప్రయోజనం ఏముంది?
నువ్వు వున్నది అక్కడే కదా!
నువ్వు వున్న క్లాసే నీకు చెబితే ఏమిటండీ మీకు ప్రయోజనం?
నీవు అక్కడే కదా వున్నావు? ఆపనే కదా చేస్తున్నావు?
ఇక దాన్ని చెప్పి ప్రయోజనం ఏమి వుంది? అవునా కాదా?

అజ్ఞానాన్ని పొగొట్టాలి అంటే, జ్ఞాన దీపాన్ని వెలిగించాలి అంటే,
వత్తి కాలిపోవాలా అక్కర్లేదా?
వత్తి మాత్రం కాలకూడదండీ, దీపం మాత్రం వెలగాలండీ, ఎలా కుదురుతుంది?

నాకు ఏ నష్టం రాకూడదండీ, ఏ కష్టం రాకూడదండీ, ఏమీ సమస్యలు రాకూడదండీ, అంతా క్షేమంగా వుండాలి, అంతా సుఖంగా వుండాలి. జ్ఞానం మాత్రం వచ్చేయాలి.
ఇది సాధ్యమా?
అసాధ్యం కదా!
అర్థమైందా అండీ?
                                   అనేక జన్మార్జితమైనటువంటి సంచితరాశిని దగ్ధం చేయగలిగేటటు వంటి జ్ఞానాగ్నిని, సంపాదించాలనే ఉత్తమ లక్ష్యాన్ని సాధించాలనుకున్నవాడికి, ఈ నడిమంత్రపు సిరితో వచ్చేటటువంటి, నడి మంత్రపు కష్టాలతో వచ్చేటటువంటి, సమస్యలు ఏపాటివి?
పెద్ద సముద్రాన్ని లంఘించాలనుకున్నవాడికి పిల్లకాలువ దాటడం ఏపాటి?
                                   అలాంటి సింహ హృదయంతో, అలాంటి ధీరోదాత్తమైన లక్షణం వున్నవాడు పనికి వస్తాడు.

భీరువు అయినవాడు?
                                   కాసేపు నక్షత్ర హారతి ఇవ్వవచ్చు, కాసేపు కుంభహారతి ఇవ్వవచ్చు, కాసేపు చంద్రహారతి ఇవ్వవచ్చు, కాసేపు కర్పూర హారతి ఇవ్వవచ్చు... వాటితో సంతృప్తి చెందవచ్చు. అర్థమైందా?

                                   కాబట్టి ఇకపై ఎవరైతే ఇలా, ఈ మార్గంలో నడుద్దామని అనుకున్నవారు వుంటారో, మీరందరూ వచ్చేసారి మనం కలిసేటప్పటికీ, మీరు ఆ రకమైనటువంటి పరిణామాన్ని పొందాలని, ఆ రకమైనటువంటి సాధనాబలంతో ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.

ప్రార్థన
ఓం ఓం ఓం
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం తత్‌ సత్
ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః
సాయిరాం.
http://sadhakudu.blogspot.in